Political News

రంగ‌నాథ్ ఎఫెక్ట్‌: రేవంత్‌కు భారీ సంక‌టం!

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి భారీ సంక‌టం ఏర్ప‌డింది. 2023లో రాష్ట్ర సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వెంట‌నే రేవంత్ మూసీ ప్ర‌క్షాళ‌న‌కు న‌డుం బిగించారు. ఈ క్ర‌మంలోనే హైడ్రా(హైదరాబాద్ విపత్తు నిర్వహణ మరియు ఆస్తి రక్షణ సంస్థ)ను ఏర్పాటు చేశారు. దీనిని స్వ‌యంగా రేవంత్ రెడ్డి ప‌ర్య‌వేక్షిస్తున్నారు. అంతేకాదు.. అస‌లు హైడ్రా వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేయ‌డానికి ముందు పార్టీ ప‌రంగా కూడా అధిష్టానం నుంచి ఆయ‌న అనుమ‌తి తీసుకున్నారు. ఇలా.. అత్యం త‌ప్ర‌తిష్టాత్మ‌కంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు క‌మిష‌న‌ర్‌గా సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి డీజీ ర్యాంకు అధికారిగా ఉన్న రంగ‌నాథ్‌ను నియ‌మించారు.

కేవ‌లం నియామ‌కాల‌తోనే రేవంత్ స‌రిపుచ్చలేదు. రంగ‌నాథ్‌కు విస్తృత‌మైన అధికారాలు క‌ట్ట‌బెట్టారు. అంతేకాదు.. ప్ర‌భుత్వం త‌ర‌ఫున కూడా రంగ‌నాథ్‌కు అన్ని విధాలా అండ‌గా ఉన్నారు. శ‌నివారం, ఆదివారం సెల‌వు రోజుల్లో ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించ‌డం.. ఇళ్ల‌పైకి బుల్ డోజ‌ర్లు రావ‌డం.. ప్ర‌జ‌ల ఆందోళ‌న‌, పెద్ద‌ల నుంచి ఎదురైన స‌వాళ్లు.. ఇలా అనేక విష‌యాల‌ను త‌ట్టుకుని మ‌రీ హైడ్రాను ముందుకు న‌డిపిస్తున్నారు.  ఈ క్ర‌మంలో ప‌లు సంద‌ర్భాల్లో హైకోర్టు నుంచి కూడా హైడ్రాపై అనేక సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. అప్ప‌టిక‌ప్పుడు దీనిని చ‌ట్టం రూపంలో తీసుకువ‌చ్చారు.

ఇలా.. ఏర్పాటు చేసిన హైడ్రాకు క‌మిష‌న‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన రంగ‌నాథ్‌.. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత స‌న్నిహితంగా మారారు. ఆయ‌న క‌నుస‌న్న‌ల్లో, ఆయ‌న ఆకాంక్ష‌ల మేరకు రంగ‌నాథ్ న‌డుచుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఎన్ని అవాంత‌రాలు.. ఇబ్బందులు వ‌చ్చినా రంగ‌నాథ్‌నే కొన‌సాగించారు. అయితే.. ఇప్పుడు హైకోర్టు నేరుగా ప్ర‌భుత్వాన్ని ఆదేశించ‌డం, రంగ‌నాథ్‌ను త‌ప్పించాల‌ని ప‌ట్టుబ‌ట్ట‌డంతో  సీఎంగా రేవంత్ ఏం చేస్తార‌న్న‌ది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. ఆయ‌న ఏరికోరి తెచ్చుకుని నియ‌మించిన క‌మిష‌న‌ర్‌ను ఇప్పుడు చేజేతులా ప‌క్క‌న పెడ‌తారా? లేక మ‌రోమార్గం అనుస‌రిస్తారా? అనేది చ‌ర్చకు దారితీసింది.

ఇదిలావుంటే.. బీఆర్ఎస్ నుంచి ఎదురు దాడి ప్రారంభ‌మైంది. రంగ‌నాథ్‌ను త‌ప్పించ‌డం అంటే.. సీఎంను త‌ప్పించ‌డ‌మేన‌ని పార్టీ వ‌ర్గాలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో రంగ‌నాథ్ ను కొన‌సాగించేందుకు రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు త‌లుపు త‌ట్టే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ, ఇక్క‌డే ఆయ‌న‌పై న‌మోదైన 63 కోర్టు ధిక్క‌ర‌ణ కేసులు అడ్డుప‌డే అవ‌కాశం ఉంద‌ని న్యాయ‌వాద వ‌ర్గాల నుంచి మ‌రో వాద‌న వినిపిస్తోంది. సో..ఎలా చూసుకున్నా.. ఇటు రాజ‌కీయంగా.. అటు న్యాయ వ‌ర్గాల ప‌రంగా కూడా రంగ‌నాథ్ వ్య‌వ‌హారం సీఎం రేవంత్‌కు సెగ పెట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. 

This post was last modified on July 28, 2026 2:45 pm

Share

Recent Posts

శాంసంగ్ ఏడేళ్ల కష్టం.. యాపిల్ ఎందుకింత ఆలస్యం

ఫోల్డబుల్ ఫోన్ అంటే ముందుగా గుర్తొచ్చేది శాంసంగ్. 2019లో తొలి గెలాక్సీ ఫోల్డ్‌ను తీసుకొచ్చిన ఆ కంపెనీ, అప్పటి నుంచి…

20 minutes ago

ఫౌజీ వెనుక అసలేం జరుగుతోంది

ఫౌజీ వాయిదా గురించి నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయినా పోస్ట్ పోన్ ఖాయమని…

24 minutes ago

స్కూలు సెలవు కోసం మర్డర్ ప్లాన్

మొబైల్ ఫోన్లు చేతిలోకి వచ్చాక రోజుకో కొత్త రకం నేరం బయట పడుతుంది. ముఖ్యంగా యువతీ యువకులు, మైనర్ బాలుల్లో…

40 minutes ago

టాలీవుడ్ హీరోలూ… స్పీడ్ పెంచండయ్యా

కారణాలు లక్షా తొంభై ఉండని, టాలీవుడ్ హీరోలు చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తున్నారనేది వాస్తవం. రవితేజ, శ్రీవిష్ణు లాంటి ఒకరిద్దరిని…

1 hour ago

ఎఫెక్ట్ పడింది… ఐఫోన్ 18 ప్రో ధర పెరిగింది

ప్రతి ఏడాది కొత్త ఐఫోన్ వస్తుంది. కెమెరా మారుతుంది, చిప్ వేగం పెరుగుతుంది. కానీ ఈసారి ఐఫోన్ 18 ప్రోతో…

2 hours ago

బేబీ జంటకు ‘ఎపిక్’ ఎగ్జామ్

రేపు విడుదల కాబోతున్న ఎపిక్ ఇవాళ రాత్రి నుంచే ప్రీమియర్ షోలు వేయనుంది. హైదరాబాద్ ఒకటే కాకుండా ఏపీ, తెలంగాణ…

2 hours ago