ఏపీ సీఎం జగన్ చిన్నాన్న.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి నేటికి 4 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇదే రోజున 2019 తెలతెల వారుతుండగా.. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా వివేకా మరణంపై ఉలిక్కిపడ్డాయి. తొలుత రెండు మూడు గంటల పాటు అసలు ఏం జరిగిందనే విషయంపై ఒక ప్రత్యేక సందిగ్ధావస్థ నెలకొంది. ఓ వర్గం టీవీ.. గుండెపోటు అని ప్రచారం చేసింది. కానీ, రెండు గంటలు గడిచిన తర్వాత.. మాత్రమే అది దారుణ హత్య అని తేలింది.
సరే.. వివేకా 4వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన కుమార్తె, ప్రముఖ వైద్యురాలు సునీత ఆయన సమాధి వద్ద ఘన నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాను తన తండ్రి హత్యపై ఎందుకు పోరాటం చేస్తున్నదీ వివరించారు. తన తండ్రి హత్య జరిగితే.. సొంత కుటుంబ సభ్యులే(పేరు చెప్పలేదు) తేలికగా తీసుకున్నారని.. కనీసం జాలి కూడా చూపించలేదన్నారు. అంతేకాదు.. ఇవన్నీ రాయలసీమలో కామనే! అని వ్యాఖ్యానించినట్టు చెప్పారు.
ఇదే తనలో పౌరుషం పెంచిందన్నారు. ఇది కామన్ కాదు.. పక్కా వ్యూహంతోనే జరిగిందని భావించి.. అనేక రూపాల్లో విచారణకు ప్రయత్నించానని.. కానీ, చివరకు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. ఇక, ఏపీ ప్రభుత్వం ఈ విచారణలో జోక్యం చేసుకోవద్దని ఆమె మరోసారి విన్నవించారు. ఈ హత్య వెనుక నిజానిజాలు తెలియాల్సి ఉందని.. నిగ్గు తేలితే తప్ప.. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండవని చెప్పారు.
తనకు ఉన్న అన్ని సందేహాలను అఫిడవిట్ రూపంలో కోర్టుకు వివరించినట్టు తెలిపారు. అదేవిధంగా సీబీఐ కి కూడా సహకరిస్తున్నట్టు చెప్పారు. “నా సొంత కుటుంబ సభ్యులపైనే ఆరోపణలు చేశాను. ఇది నాకు కూడా బాధగానే ఉంది. కానీ, వారు మానాన్న ను అత్యంత కిరాతకంగా చంపేశారు. అందుకే నిజాలు తెలియాలి.. మాపై ఉన్న ఆరోపణలు పోవాలనే ఉద్దేశంతో నే న్యాయపోరాటానికి దిగాను” అని సునీత అన్నారు.
This post was last modified on March 15, 2023 11:43 am
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…