ఈ సారి అరెస్టేనా …!

వివేక హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ఉచ్చు బిగుస్తున్నట్లే అనిపిస్తోంది. విపక్షాల ఆరోపణలు, ఆయనపై అనుమానాల మధ్య సీబీఐ మూడో సారి ఆయన్ను ప్రశ్నించబోతోంది. జనవరి 28, ఫిబ్రవరి 24న విచారించిన సీబీఐ మళ్లీ ఈ నెల 6న విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు నోటీసులు ఇచ్చింది. పులివెందులలో ఆయన నివాసానికి వెళ్లి మరీ సీబీఐ అధికారులు నోటీసులు అందించి వచ్చారు. వరుసగా రెండు సార్లు ప్రశ్నించిన తర్వాత తలెత్తిన మరికొన్ని ప్రశ్నల ఆధారంగా అవినాష్ ను విచారించే అవకాశం ఉంది. ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేశారు. ఆరో తేదీన కడపలో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు..

కోటలో గుస గుస

వివేకా హత్యకు తాడేపల్లి ప్యాలెస్ కు ఉన్న లింకులను తెలుసుకునేందుకు, అనుమానితులను బిగించేందుకు సీబీఐ ప్రయత్నిస్తూనే ఉంది. వివేకా హత్య రోజున అవినాష్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ కు ఫోన్ చేసినట్లు గుర్తించారు. ఆ దిశగా వైఎస్ భారతి సహాయకుడు నవీన్, సీఎం కార్యాలయ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని సీబీఐ ఇప్పటికే ఒకసారి ప్రశ్నించింది. మరోసారి ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. నిజానికి నవీన్ కు నోటిసులు వెళ్లాయని చెబుతన్నారు. అయితే అటు సీఎం కార్యాలయం, ఇటు సీబీఐ మాత్రం ఆ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచుతున్నాయి.

సాక్షిగానా.. నిందితుడిగానా…

ఇంతవరకు అవినాష్ రెడ్డిని రెండు సార్లు పిలిచినప్పుడు 160 సీఆర్పీసీ కింద సాక్షిగా నోటీసులు ఇచ్చి ప్రశ్నించారు. ఇప్పుడు కడప నుంచి పులివెందుల వెళ్లిన సీబీఐ అధికారులు సోమవారం తప్పకుండా హాజరు కావాలని నోటీసులిచ్చింది. హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ పెరిగింది. వివేకానంద రెడ్డి హత్యకు నలభై కోట్ల సుపారీ ఇచ్చిన పక్షంలో ఆ డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయని ప్రశ్నించబోతున్నారు….