ఆ మంత్రికి టికెట్ ఇస్తే అంతేన‌ట‌.. బీఆర్ఎస్ టాక్ గురూ!

రాజ‌కీయాలు ఎప్పుడూ.. ఒకేలా ఉండ‌వు. డ‌బ్బు.. ప‌లుకుబ‌డి ఉన్న‌ప్ప‌టికీ.. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితులు అన్నీకూడా అనుకూలించే ప‌రిస్థితి ఉండ‌దు. ఇప్పుడు తెలంగాణలో కీల‌క మంత్రి మల్లారెడ్డి ప‌రిస్థితి కూడా దీనికి భిన్నంగా లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మేడ్చ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2018 ఎన్ని క‌ల్లో విజ‌యంద‌క్కించుకున్న మ‌ల్లారెడ్డి కేసీఆర్ ప్ర‌భుత్వంలో మంత్రిగా అవ‌కాశం ద‌క్కించుకున్నారు.

ప్ర‌ముఖ విద్యాసంస్థ‌ల అధినేత‌గా ఆయ‌న సుప‌రిచితులే అయిన‌ప్ప‌టికీ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు అంత‌గా సాన‌కూల ప‌వ‌నాలు, ప‌రిస్థితి కూడా క‌నిపించ‌డం లేద‌న్న‌ది ప్ర‌స్తుతం వ‌స్తున్న టాక్‌. ఇటీవ‌ల కాలంలో మ‌ల్లారెడ్డి మీడియాలో ఏదో ఒక విష‌యంలో క‌నిపిస్తూనే ఉన్నారు. త‌న సంస్థ‌ల్లో ఐటీ దాడులు చేసిన‌ప్పుడు.. త‌ర్వాత కాలేజీ ఫంక్ష‌న్‌లో డ్యాన్స్ చేయ‌డం ద్వారా.. తీవ్ర విమ‌ర్శ‌లు..కేంద్రంపై విరుచుకుప‌డ‌డం ద్వారా ఆయ‌న మీడియా దృష్టి ని ఆక‌ర్షించారు.

ఇక‌, అదేస‌మ‌యంలో కేంద్రంలో కేసీఆర్ అధికారంలోకి వ‌స్తారంటూ.. ఆయ‌నే ప్ర‌ధాని అవుతారంటూ కూడా వ్యాఖ్య‌లుచేశారు. అయితే.. ఇంత చేస్తున్నా.. రాష్ట్ర వ్యాప్తంగా మ‌ల్లారెడ్డి వార్త‌ల్లో నిలుస్తున్నా మేడ్చ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం మ‌ల్లారెడ్డికి సెగ బాగానే త‌లుగుతోంది. సొంత పార్టీ నేత‌లే ఆయ‌న‌ను దూరం పేడుతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనికి తోడు నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ దూకుడు పెరిగింది.

గ‌త ఎన్నిక‌ల్లో ఎవ‌రూ ఊహించ‌ని విధంగా మ‌ల్లారెడ్డి 87 వేల ఓట్ల మెజారిటీతో ఘ‌న విజ‌యం ద‌క్కించుకు న్నారు. కానీ, ఇప్పుడు మాత్రం ఆయ‌న‌కు టికెట్ ఇవ్వొద్ద‌ని మేడ్చ‌ల్ బీఆర్ ఎస్ నేత‌లే.. పార్టీకి వ‌ర్త‌మానాలు పంపుతున్నారు. ఆయ‌న కాకుండా.. ఎవ‌రికి టికెట్ ఇచ్చినా స‌హ‌క‌రిస్తామంటూ.. కొంద‌రు పారిశ్రామిక వేత్త‌లు కూడా.. క‌బురు పెడుతుండ‌డంతో అస‌లు మ‌ల్లారెడ్డి ప‌రిస్థితి ఏంట‌నేది ఆస‌క్తిగా మారింది. ఈయ‌న ప్ర‌స్తుతం కేసీఆర్ వ‌ర్గంలో ఉన్నారనే టాక్ ఉంది. దీంతో కేటీఆర్‌కు మ‌ల్లారెడ్డికి మ‌ధ్య మాట‌లు కూడా లేవు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.