విశాఖ పట్నం టీడీపీలో నేతలకు పెద్ద పరీక్షే ఎదురైంది. ప్రస్తుతం జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ ప్రతిష్టాత్మికంగా తీసుకుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల సమరానికి ముందు సెమీఫైనల్ గా భావిస్తున్న మండలి అభ్యర్థుల ఎన్నిక.. టీడీపీకి నిజంగానే పరీక్షకానుంది. వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ బలాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడంతోపాటు.. టీడీపీ పుంజుకుందనే సంకేతాలు పంపించాల్సిన అవసరం టీడీపీపై ఉంది.
ఈ నేపత్యంలోనే టీడీపీ ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ము ఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో పట్టభద్రుల స్థానాలకు జరుగుతున్న ఎన్నికను టీడీపీ మరింత ప్రతిష్టాత్మకం గా తీసుకుంది. టీడీపీ పట్టభద్రుల స్థానం ఎమ్మెల్సీ అభ్యర్థిగా వేపాడ చిరంజీవి రావు నిలబడ్డారు. ఈయన నామినేషన్ ఓకే కూడా అయింది. దీంతో ఇప్పుడు ఆయనను గెలిపించుకోవాలని.పార్టీ గట్టిగా నిర్ణయించుకుంది.
మరీ ముఖ్యంగా విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ ముఖ్యనాయకులు, శ్రేణులు కూడా వేపాడను గెలిపించుకోవాలని చూస్తున్నారు. ముఖ్యంగా గండి బాబ్జీ, ఎంపీ అభ్యర్థి.. బాలయ్య చిన్నల్లుడు.. ఎం. శ్రీభరత్ వంటివారికి కూడా వేపాడ విజయం పరీక్షేనని చెప్పాలి. ఎన్నిక ముగిసే వరకు ప్రచార బాధ్యతలను పక్కాగా నిర్వహించాలని చంద్రబాబు కూడా సూచనలు పంపారు.
వైసీపీ ప్రభుత్వ పాలనలో అన్ని రంగాలు వైఫల్యం చెందాయనే సందేశాన్ని ప్రధానంగా ప్రజల్లోకి పంపించనున్నారు. ముఖ్యంగా పట్టభద్రులైన నిరుద్యోగ సమస్యలను ప్రధానంగా ప్రస్తావించనున్నారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో ఈ గెలుపు ప్రభావం చూపుతుండడంతో వైసీపీ కూడా అదే తరహాలో ఇక్కడ ప్రచారం చేపట్టే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates