అనుకున్నదే జరుగుతోంది. ఏపీలో రాజకీయాలు భారీ స్థాయిలో వేడెక్కాయి. అనూహ్యమైన పరిణామంగా.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయాన్ని టీడీపీ ఇప్పుడు ఊరూవాడా ప్రచారం చేయాలని నిర్ణయించింది .గత ఎన్నికలకు ముందు.. వివేకా హత్యకు గురైన విషయం తెలిసిందే. దీనిని తమకు అనుకూలంగా మార్చుకున్న వైసీపీ.. అప్పటి ఎన్నికల్లో ప్రజల నుంచిసానుభూతిని సొంతం చేసుకుంది.
ఫలితంగా.. వైసీపీ భారీ సంఖ్యలో ఓట్లు సీట్లు దక్కించుకుంది. ఇక, ఇప్పుడు అదే మంత్రాన్ని టీడీపీ జపి స్తోంది. సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరిన సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు.. అన్నీ కూడా వివేకానంద రెడ్డి హత్య.. దీనిలో సీఎం జగన్ పాత్ర.. నాటకం.. ఎలా రక్తి కట్టించారు? అనే విషయాల చుట్టూనే తిరిగాయి. అసలు ఈ కేసుతో జగన్‌కు సంబంధం ఉందని కూడా చంద్రబాబు వివరించారు.
మొత్తంగా చూస్తే.. టీడీపీ వివేకా కేసుతో దూకుడు పెంచిందనే తెలుస్తోంది. ఇలా..చంద్రబాబు ఈ విషయాన్ని అందిపుచ్చుకోగానే.. టీడీపీ అనుకూల మీడియాలోనూ వివేకానందరెడ్డి మరణంపై తీవ్రస్థాయిలో చర్చలు జరిగాయి. తాజాగా సీబీఐ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం.. దీనిలో ఏం జరిగిందో కొంత చెప్పడం వంటి పరిణామాలు..ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు తీవ్ర ప్రభావం చూపేలా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు.
ముఖ్యంగా టీడీపీ ఇప్పుడు వివేకా కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేస్తున్న విషయం కూడా చర్చకు వస్తోంది. క్షేత్రస్థాయిలో జగన్‌ను ఎదిరించేందుకు ఉన్న అవకాశం ఇదేనని భావిస్తున్న టీడీపీ.. ఇక నుంచి ఆయనను రాజకీయంగానే కాకుండా నైతికంగా కూడా దెబ్బతీయాలని నిర్ణయించింది. మరి ఏమేరకు టీడీపీ సక్సెస్ అవుతుందో చూడాలి.
This post was last modified on February 24, 2023 9:34 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…