Political News

జ‌గ‌న్ కేబినెట్లోకి కొడాలి నాని, తోట త్రిమూర్తులు…?

అంద‌రూ అనుకున్న విధంగానే.. రెండు కీల‌క విష‌యాల్లో సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి మ‌రోసారి త‌న కేబినెట్‌ను విస్త‌రించాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్న‌ట్టు కొన్నాళ్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అదే స‌మ‌యంలో ముందస్తుగా ఎన్నిక‌లకు కూడా వెళ్లాల‌ని చూస్తున్నారు. అయితే.. ఈ రెండు విష‌యాల‌పైనా కొన్నాళ్లుగా త‌ర్జ‌న భ‌ర్జ‌న అయితే సాగుతోంది. ఎటూ నిర్ణ‌యం తీసుకోలేక పోతున్నారు.

అయితే.. ఇప్పుడు ఎన్నిక‌ల‌కు ముందు.. సీఎం జ‌గ‌న్ ఆ దిశ‌గానే అడుగులు వేస్తున్నార‌నేది తాడేప‌ల్లి వ‌ర్గాల మాట‌. తాజాగా కీల‌క నేత‌ల‌తో ర‌హ‌స్య మంత‌నాలు జ‌రిపిన‌ట్టు తెలుస్తోంది. బాలినేని శ్రీనివాస‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణరెడ్డి కూడా ఈ మంతనాల్లో పాల్గొన్నార‌ని తెలిసింది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పార్టీని బ‌లోపేతం చేయ‌డంపై కాకుండా.. ముంద‌స్తుగానే ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌నేది ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం.

ప్ర‌స్తుతం టీడీపీ దూకుడు పెరిగింది. ఒక‌వైపు యువ‌గ‌ళం పేరుతో నారా లోకేష్‌.. మ‌రోవైపు ఇదేం ఖ‌ర్మ పేరుతో చంద్ర‌బాబు కూడా ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటున్నారు. ఇంకోవైపు వారాహితో ప‌వ‌న్ కూడా ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చేందుకు ముహూర్తాలు చూసుకుంటున్నారు. ఈ వేడి ప్రారంభ‌మై.. ప్ర‌జ‌ల్లోకి కాక పుట్టించేలోగానే ఎన్నిక‌ల‌కు వెళ్లిపోతే.. ఎంతో మంచిద‌నేది వైసీపీ అదినేత ప్లాన్‌గా ఉంది. అదేస‌మ‌యంలో పార్టీలో అసంతృప్తిని సాధ్య‌మైనంత వ‌ర‌కు త‌గ్గించేయాల‌ని చూస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే మ‌రోసారిమంత్రివ‌ర్గాన్ని విస్త‌రించ‌డం ద్వారా.. ఈ వ్యూహాన్ని అమ‌లు చేయాల‌ని చూస్తు న్నార‌ట‌. ఇప్పుడున్న మంత్రుల్లో త‌ప్పా.. తాలూ అని భావిస్తున్న వారిని ప‌క్క‌న పెట్టి.. బ‌ల‌మైన వారిని తీసుకునే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. వీరిలో ప్ర‌ధానంగా కొడాలి నాని, తోట త్రిమూర్తులు.. వంటి ఫైర్ బ్రాండ్స్‌కు ఛాన్స్ ఇచ్చే అవ‌కాశం కూడా క‌నిపిస్తోంద‌న్న‌ది వైసీపీ వ‌ర్గాల మాట‌. మొత్తానికి అంద‌రూ అనుకున్న‌ట్టుగానే జ‌గ‌న్ నిర్ణ‌యాలు ఉండే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.

This post was last modified on February 18, 2023 2:31 pm

Share

Recent Posts

పెంచి పోషించిన గ్రోకే దెబ్బేసిందిగా మస్క్

భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే మస్క్ సొంత AI చాట్‌బాట్ గ్రోక్…

3 minutes ago

పెళ్లి పేరుతో బిగ్ బాస్ విన్నర్ మోసం?

తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ విజేత ముత్తుకుమరన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వహిదా అక్దర్…

8 minutes ago

జైలర్ 2 ఋజువు చేయాల్సినవి ఎన్నో

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో తెరకెక్కుతున్న జైలర్ 2 అక్టోబర్ పదిహేను విడుదలవుతున్న సంగతి…

14 minutes ago

సెన్సార్ మీద ఎంత వ్యతిరేకత చూపించినా

టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…

3 hours ago

బీసీ రిజర్వేషన్లపై తేల్చేసిన సుప్రీం

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…

4 hours ago

తీరం చేరని ఏజెంట్ దర్శకుడి కలలు

ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…

4 hours ago