వచ్చే ఎన్నికల్లో విజయం కోసం పోరాడుతున్న టీడీపీకి పంటి కింద రాళ్ల మాదిరిగా పరిస్థితులు ఇబ్బంది పెడుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో 175 చోట్ల విజయం దక్కించుకుంటామని.. నాయకులు చెబుతున్నారు. అయితే.. ఈ క్రమంలో జనసేనతో పొత్తు పెట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయని క్లూ ఇస్తున్నారు. దీంతో జనసేనతో పొత్తు పెట్టుకుంటే.. తమకు ఎక్కడ పోటీకి అవకాశం లేకుండా పోతుందనని భావిస్తున్న టీడీపీ నేతలు తమ దారితాము చూసుకుంటున్నారట.
ఇలాంటి వారిలో ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీసిన నియోజకవర్గం ఉమ్మడి కృష్నాజిల్లాలోని కైకలూరు. టీడీపీ ఎవరితో పొత్తులు పెట్టుకున్నా.. వదిలేసే నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. విజయవాడలో అయితే.. పశ్చిమ నియోజకవర్గాన్ని వదిలేస్తుంది. పశ్చిమ గోదావరిలో అయితే నరసాపురం నియోజక వర్గాన్ని వదిలేస్తుంది. అలానే కృష్ణాలో కైకలూరు ను కూడా పొత్తు పార్టీలకు వదిలేయడం.. టీడీపీకి ఆనవాయితీగా వస్తోంది.
2014లో బీజేపీతొ పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో కైకలూరు నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించింది. అయితే.. దీనికి ముందు ఇక్కడ అంటే 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన జయమంగళ వెంకటరమణ అప్పటి వైఎస్ హవాలోనూ పోరాడి విజయం దక్కించుకున్నారు. కానీ, తర్వాత ఎన్నికలకు పొత్తుల పరిణామం.. ఆయనకు టికెట్ లేకుండా చేసింది. ఇక, గత ఎన్నికల్లో జయ ఓడిపోయారు.
ఇక, వచ్చే ఎన్నికల్లో అయినా.. పోటీ చేసి విజయం దక్కించుకునేందుకు జయమంగళ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇంతలోనే జనసేనతో పొత్తు అంటూ.. టీడీపీ ప్రయత్నాలు చేయడం.. ఇదే జరిగితే.. తన సీటును జనసేనకు కేటాయిస్తారనే సంకేతాలను జయమంగళ పసిగట్టడంతో ఇప్పుడు ఆయన తనదారి తాను చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన వైసీపీ వైపు చూస్తున్నారని అంటున్నారు. మరోవైపు.. వైసీపీ ఈయనకు టికెట్ ఇస్తుందో లేదో తెలియదు కానీ.. టీడీపీ నుంచి బలమైన నేతలకు మాత్రం గేలం వేస్తోంది. ఈ నేపథ్యంలోనే జయ వైసీపీకి చిక్కుకున్నట్టు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates