Political News

కోటంరెడ్డికి ఆయనే అడ్డంకా

సీఎం జగన్‌పై, ఆయన సలహాదారు సజ్జలపై డైరెక్టుగా విమర్శలు చేసి ఆ పార్టీతో తెగతెంపులు చేసుకుంటున్నానని ప్రకటించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలో చేరుతారని సంకేతాలిచ్చారు. అయితే, టీడీపీలో పరిస్థితులు మాత్రం కోటంరెడ్డికి ఏమాత్రం అనుకూలంగా కనిపించడం లేదు. ముఖ్యంగా నెల్లూరు పార్టమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ నుంచి కోటంరెడ్డికి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోంది. కోటంరెడ్డిని టీడీపీలోకి రానిచ్చేది లేదని ఆయన మండిపడుతున్నారు. ఇప్పటికే టీడీపీ పెద్దలకు ఈ విషయాన్ని ఖరాకండీగా చెప్పేసిన అజీజ్ ప్రెస్ మీట్లు కూడా పెట్టి కోటంరెడ్డిపై నిప్పులు చెరుగుతున్నారు.

తాజాగా ఆయన కోటంరెడ్డిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ బెట్టింగులు ఆడేవారున, సింగిల్ నంబర్ లాటరీలు ఆడించేవారిని టీడీపీలోకి రానిచ్చేది లేదని అజీజ్ అన్నారు. ఎవరైనా ఇంట్లో పండ్లు, పూల మొక్కలు వేస్తారు కానీ గంజాయి మొక్కలు నాటరని అన్నారు.

టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేసినవారిని పార్టీలోకి ఎలా చేర్చుకుంటామని ప్రశ్నించిన అజీజ్.. టీడీపీ అధికారంలోకి రాగానే అంతకంత బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు. అంతేకాదు.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గతంలో దౌర్జన్యంగా వైసీపీలో చేర్చుకున్నారని చెప్పే జున్ను రాఘవయ్య అనే నేతను తిరిగి టీడీపీ కండువా కప్పారు అజీజ్.

వైసీపీతో కోటంరెడ్డి తెగతెంపులు చేసుకోవడంతో ఇప్పుడాయనకు ఏదో ఒక పార్టీలో చేరాల్సిన పరిస్థితి ఉంది. కానీ, టీడీపీలోకి ఆయన్ను రానివ్వడానికి స్థానిక నాయకులు, కార్యకర్తలు ససేమిరా అంటున్నారు. ముఖ్యంగా అబ్దుల్ అజీజ్ నుంచి ఎన్నడూ లేనంత ప్రతిఘటన వస్తుండడంతో టీడీపీ అధిష్టానం కూడా కోటంరెడ్డి విషయంలో ఏమీ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నెల్లూరు రూరల్ ప్రాంతంలో అజీజ్ అహ్మద్‌కు బాగా పట్టుండడం… ఆయనతో పాటు మిగతా నేతలూ కోటంరెడ్డి రాకకు ఏమాత్రం అనుకూలంగా లేకపోవడంతో టీడీపీ ఎటూ తేల్చుకోలేకపోతోంది.

This post was last modified on February 13, 2023 11:35 pm

Share

Recent Posts

త్రివిక్ర‌మ్ మొద‌టి డైలాగ్ రాసిందెవ‌రికి?

ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? ర‌చ‌యిత‌గా త‌న తొలి సినిమా స్వ‌యంవ‌రం కాబ‌ట్టి.. ఆ సినిమాకే…

5 hours ago

గ‌న్న‌వ‌రంలో వంశీ సెంటిమెంటు రాజ‌కీయం.. !

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే దిశగా…

6 hours ago

స్వయంభు సమస్యేంటో అంతు చిక్కడం లేదు

నిఖిల్ సిద్దార్థ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా స్వయంభు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఫిబ్రవరితో…

7 hours ago

చిరంజీవి చూపు ఎవరి మీద ఉంది

కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…

11 hours ago

ట్రంప్‌.. ప్ర‌జాద‌ర‌ణ ఢ‌మాల్‌.. దేశ చ‌రిత్ర‌లో ఫ‌స్ట్ టైమ్‌!

అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది. వాస్త‌వానికి గ‌త ఏడాదే ఆయ‌న ప్ర‌జాద‌ర‌ణ త‌గ్గుముఖం…

11 hours ago

రాజమౌళి రాజసానికి 25 సంవత్సరాలు

టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…

13 hours ago