టీడీపీ కంచుకోటల్లో ఫ్యాన్ రివ‌ర్స్‌లో తిరుగుతోందా…!

రాష్ట్రంలో టీడీపీ కంచుకోట‌లు సుమారు 50 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. ఈ 50 నియోజ‌క‌వ‌ర్గాల్లో దాదాపు 35 నుంచి 40 స్థానాల్లో పార్టీ ఓట‌మి పాలైంది. గ‌త ఎన్నికల్లో గెలుపు అంచుల వ‌ర‌కు కూడా వ‌చ్చి వీరంతా ఓడిపోయారు. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలోపెట్టుకుంటే.. ఈ కంచుకోట‌లు ప‌దిల‌మేనా? అనే చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారి తీస్తోంది. ముఖ్యంగా కీల‌క‌మైన స్థానాల్లో గెలుపు ప్ర‌భావం ఎలా ఉంది? అనేది కూడా చ‌ర్చ‌కు వ‌చ్చింది.

ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాల మేర‌కు.. టీడీపీ కంచుకోట‌ల్లో గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ పాగా వేసింది. తొలిసారి టికెట్లు పొందిన వారు .. సీనియ‌ర్లు కూడా టీడీపీ స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఇప్పుడు వారి ప‌రిస్థితి డోలాయ మానంలో ఉంద‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. దీనికి కార‌ణం.. ప్ర‌జ‌లు ఎంతో విశ్వ‌స‌నీ యంగావారిని గెలిపించిన‌ప్ప‌టికీ.. ప్ర‌జ‌లు అనుకున్న రేంజ్లో వారు.. ఇక్క‌డ ప్ర‌భావం చూపించ‌డం లేదు.

దీనికితోడు.. ప్ర‌జ‌ల‌కు, ఎమ్మెల్యేల‌కు కూడా గ్యాప్ పెరిగిపోయింది. అదేస‌మ‌యంలో టీడీపీ నేత‌లు పుంజు కోవడం.. కూడా కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ గెలుపును సునాయాసం చేసింద‌ని అంటున్నారు. ఉదాహరణ‌కు.. టీడీపీకి ఎప్ప‌టి నుంచో ప‌ట్టున్న ఏలూరు నియోజ‌వ‌క‌ర్గంలో మాజీ మంత్రి ఆళ్ల నాని విజ‌యం ద‌క్కించుకున్నారు. కానీ, ఈయ‌న‌కు గ‌త ఎన్నిక‌ల్లో ఉన్న హ‌వా ఇప్పుడు క‌నిపించ‌డం లేదు.

అదేవిధంగా నెల్లూరు, ఒంగోలు, విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌, పెద‌కూర‌పాడు, తాడికొండ, వినుకొండ‌, గుర‌జాల‌, అర‌కు, పాడేరు వంటి నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైసీపీ ఎమ్మెల్యేలు ఆశించిన విధంగా ప్ర‌జ‌ల‌కు పాల‌న చేరువ చేయ‌లేక పోతున్నారు. ముఖ్యంగా టీడీపీ నేత‌ల‌తో పోల్చుకుంటే.. 2014-19 మ‌ధ్య ఉన్న జోష్ ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. దీంతో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌జ‌లు తిరిగి టీడీపీనే కోరుకుంటున్నార‌ని తెలుస్తోం ది. అయితే..టీడీపీకి జోష్ క‌నిపిస్తున్నా.. నేత‌లు పుంజుకునే విధానం బ‌ట్టే ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.