ఏపీ ప్రజల కలల రాజధాని అమరావతి.. ఎదుగు బొదుగు లేకుండా పోయిందనే విషయం తెలిసిందే. అధి కార పార్టీ చేస్తున్న మూడు రాజధానుల జపంతో అమరావతి ఊసు లేకుండా పోయింది. అయితే.. ఇటీవల కాలంలో అమరావతి ప్రాంతంలో మరికొన్ని దారుణాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. బ్రిడ్జిలను కూ ల్చేయడం.. వాటి కోసం ఏర్పాటు చేసిన రాళ్లను ఎత్తుకుపోవడం.. రహదారులు తవ్వేసి మట్టి ఎత్తుకు పోవ డం వంటివి.. సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి.
దీనిపై ఫిర్యాదులు వచ్చినా.. ఇక్కడి రైతులు గగ్గోలు పెడుతున్నా.. పట్టించుకునే నాథుడు కనిపించకపోవ డం గమనార్హం. తాజాగా లింగరాయపాలెం సమీపంలో సీఆర్డీయే కార్యాలయం భవనం ముందున్న రోడ్డును దుండగులు తవ్వుకు పోయారు. దీనిని నమ్మాలంటే.. ఒకింత కష్టమే. కానీ, నిజం. రోడ్డును తవ్వేసి మట్టిని.. రాళ్లను కూడా ఎత్తుకు వెళ్లారు. మెటల్‌ను లారీలతో తరలించుకుపోతున్నా.. సీఆర్డీయే అధికారులు, పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం.
రోడ్డు నిర్మాణం కోసం వేసిన రోడ్‌పై పరచిన మెటల్‌ను రాత్రికి రాత్రే దుండగులు దొంగిలించుకుపోయారు. రాజధానిలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు దొంగతనాలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని రాజధాని రైతులు కోరుతున్నారు. పగలు, రాత్రి తేడాలేకుండా గడ్డం గ్యాంగ్ యథేచ్ఛగా మట్టిని దోచేస్తున్నా రెవెన్యూ అధికారులకు కనిపించడం లేదు. మట్టిని బహిరంగంగానే తరలిస్తున్నారు. ఎటువంటి అనుమతులూ లేకుండా మట్టిని తరలిస్తున్నా మైనింగ్ శాఖ అధికారులు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. ఇదే ఇప్పుడు అమరావతికి పెనుశాపంగా మారింది.