వైసీపీలో కీలక నాయకుడిగా.. ముఖ్యంగా షార్ప్ షూటర్‌గా ఇటీవల కాలంలో గుర్తింపు పొందిన నాయకుడు బాలినేని శ్రీనివా సరెడ్డి గత ఎన్నికలలో ఒంగోలు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన విజయందక్కించుకున్నారు. సీఎం జగన్‌కు కూడా దగ్గర బంధువుగా పేర్కొంటారు. దీంతో తొలి కేబినెట్‌లోనే బాలినేని మంత్రి పదవిని దక్కించుకున్నారు. ఇక, రెండోసారి ఛాన్స్ దక్కక పోయే సరికి.. తీవ్ర ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలావుంటే.. ఇప్పుడు ఆయన చుట్టూనే కొన్ని సర్వేలు సాగుతు న్నాయి.
స్థానికంగా కొందరు చేయించిన సర్వేల్లో బాలినేని పరిస్థితి ఏంటో తేలిపోయిందని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న అంచనాల మేరకు ఒంగోలు నియోజకవర్గంలో వైసీపీకి పెద్దగా ఎదురు గాలి లేదని అంటున్నారు. పైగా బాలనేని వాసన్నకు మరింత హవా పెరిగిందనే ప్రచారం ఉంది. అయితే.. వాస్తవంలోకి వెళ్తే.. బాలినేని పరిస్థితి ఆశించినట్టుగా అయితే లేదనేది నిజమని ఇక్కడి రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. బాలినేనికి ఇటీవల గడపగడపలోనూ కొంత చేదు అనుభవం కూడా ఎదురైంది. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బాలినేని వర్గం అతి కష్టం మీద గెలుపు గుర్రం ఎక్కింది.
ఇదిలావుంటే, వచ్చే ఎన్నికల్లో తన గెలుపు విషయాన్ని బాలినేని దగ్గర ఎవరైనాప్రస్తావిస్తే.. ఆయన మౌనంగానే ఉంటున్నారు. పైగా.. ఇప్పుడే ఎందుకు? అని దాట వేస్తున్నారు. ఈ క్రమంలోనే లోకల్ ఛానెళ్లు కొన్ని.. ఇదే విషయంపై పరిశీలన చేసినప్పుడు .. బాలినేని హవా తగ్గినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఒంగోలు సిటీలో పరిస్థితి అటు ఇటుగా ఉందని అంటున్నారు. ఇక్కడ టీడీపీ హవా పుంజుకుందని.. దామచర్ల సోదరుల దూకుడు బాగానే కనిపిస్తోందని చెబుతున్నారు. అంటే.. 2014 సీన్ ఇక్కడ రిపీట్ కావడం ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి.
మొత్తంగా చూస్తే.. ఒంగోలు నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతంలోనూ టీడీపీ గాలి వీస్తోందని తాజాగా ఒక అంచనా. అయితే.. మరోవైపు.. నారా లోకేష్ పాదయాత్ర చేస్తుండడం.. దీనిని మరింత పెంచుతుందనే అంచనాలు వస్తున్నాయి. అంటే.. మొత్తంగా చూసుకుంటే.. ఇప్పటి నుంచి టీడీపీ కనుక ఒకింత కష్టపడితే.. బాలినేని హవా మరింత తగ్గుతుందని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. మొత్తానికి బాలినేని వాసన్నపై అంచనాలు మాత్రం తల్లకిందులు అవుతుండడం గమనార్హం.
This post was last modified on February 2, 2023 9:21 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…