ఏపీపై కేంద్రం వైఖరి మారుతోంది. రాజకీయంగా ఏదో తేడా వస్తోంది. నిన్న మొన్నటి వరకు జగన్ సర్కారు కు అండగా ఉన్న కేంద్రం అనూహ్యంగా రూటు మార్చినట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. మరి ఈ మార్పునకు రీజనేంటి? ఎందుకు? అనేది ఆసక్తిగా మారింది. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్‌కు ఇప్పటి వరకు కేంద్రం అండగానే ఉంది. అదేవిధంగా జగన్ కూడా కేంద్రానికి దన్నుగా ఉన్నారు.
పరస్పర సహకారం కలిసి వచ్చింది. కేంద్రంలో తీసుకున్న నిర్ణయాలను తన ఎంపీలతో జగన్ సహకరించా రు. అలాగే.. రాష్ట్రానికి అవసరమైన మేరకు అప్పులు చేసుకునేందుకు కేంద్రం అనుమతించడం వంటివి ఇప్పటి వరకు సజావుగానే సాగాయి. ఇక, కేంద్రం ఇస్తున్న నిధులను కూడా వివిధ పథకాలకు వాడుతున్నా రనే వాదన వినిపిస్తున్నా.. కేంద్రం మాత్రం మౌనంగానే ఉంటోంది.
అంటే.. మొత్తంగా ఇరు పక్షాల మధ్య సహకారం.. ఉభయకుశలోపరి అన్నట్టుగానే సాగుతుండడం గమనా ర్హం. అయితే.. ఇక్కడ తాజా విషయానికి వస్తే..ఏపీలో మారుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే.. ఎక్కడో బీజేపీ.. తన దారి తాను చూసుకుంటున్నట్టు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పొత్తులు అనివార్యమైన నేపథ్యంలో బీజేపీ తన వ్యూహాన్ని అమలు చేసే క్రమంలోనే వైసీపీకి దూరం పాటిస్తున్నట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పుడు తాజాగా సీఎం జగన్.. ఢిల్లీ వెళ్లారు. ఈ క్రమంలో ఆయన రెండు రోజులు ఢిల్లీలోనే ఉంటారని.. అధికార వర్గాలు షెడ్యూ ల్ ఇచ్చాయి. కానీ.. అనూహ్యంగా జగన్ ఒక్కరోజులోనే తన పర్యటనను ముగించుకుని వచ్చేశారు. నిజానికి జగన్ ఢిల్లీ పర్యట న వెనుక.. సీబీఐ దూకుడును అంతో ఇంతో నివారించే ఉద్దేశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
ఈ క్రమంలోనే జగన్ ఢిల్లీ పెద్దలను కలుస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. కానీ, ఢిల్లీ పెద్దలు జగన్‌కు అప్పాయింట్‌మెంట్ ఇవ్వలేదని తెలిసింది. మొత్తానికి ఈ పరిణామం గమనిస్తే.. ఏదో తేడా వస్తోందని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates