ముస‌లాయ‌న‌కే అనుభ‌వం ఉంద‌ని ప్ర‌జ‌లు భావిస్తే..

తాజాగా టీడీపీ అధినేత చంద్ర‌బాబును ఉద్దేశించి ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో ఓ ముస‌లాయ‌న ఉన్నాడు అని వ్యాఖ్యానించారు. ప్ర‌త్య‌క్షంగా.. ప‌రోక్షంగా కూడా ఇప్ప‌టి వ‌రకు ఎవ‌రూ ఇలాంటి కామెంట్లు చేయ‌లేదు. అయితే.. వ్యూహాత్మ‌కంగా ఇప్ప‌టికే అనేక రూపాల్లో టీడీపీపై మాట‌ల‌దాడి చేసిన జ‌గ‌న్‌.. అండ్ కోలు.. అవేవీ పెద్ద‌గా ఫ‌లించ‌క‌పోవ‌డంతో ఏజ్ ఫ్యాక్ట‌ర్ రాజ‌కీయాలను తెర‌మీదికి తెచ్చిన‌ట్టు తెలుస్తోంది.

ఈ క్ర‌మంలోనే తాజాగా సీఎం నోటి వెంట ముస‌లి అనే మాట వ‌చ్చింది. నిజానికి ఇదే క‌నుక ప్ర‌చారం చేస్తే.. అది ప‌రోక్షంగాటీడీపీకి ల‌బ్ధి చేకూర్చే అవ‌కాశం ఉంద‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు. ఎందుకంటే.. యువ నాయ‌కుడిగా జ‌గ‌న్ రాష్ట్రానికి ఏం చేశార‌నేది ప్ర‌శ్నించుకుంటే.. అప్పులు చేయ‌డం.. పంచ‌డం మిన‌హా ఏమీ క‌నిపించ‌డం లేదు. పైగా.. ఉద‌యం 11 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు ఆఫీస్‌కు వ‌చ్చి వెళ్లిన‌ట్టు ప‌నిచేస్తున్నారు.

పైగా, పండ‌గ‌లు, సెల‌వు దినాలు, ఆదివారాల‌ను ఆయ‌న పుష్క‌లంగా.. అంటే.. ఒక ప్ర‌భుత్వ ఉద్యోగి కూడా ఇలా వాడుకోని రీతిలో(ఎందుకంటే.. ఒక్కొక్క‌సారి వారు కూడా పండుగ‌లు సెల‌వు దినాల్లో ప‌నిచేయాల్సి వ‌స్తోంది) ఆయ‌న వాడుకుంటున్నారు. ఇలా గూటిలోంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. అలా గూటిలోకి వెళ్లిపోయిన‌చందంగా.. ఇంట్లోనే ఆఫీసు పెట్టుకుని.. ఎవ‌రినైనా అక్క‌డికే పిలుచుకుని చ‌ర్చించి.. క‌థ ముగించేస్తున్నారు. నిజానికి ప్ర‌జ‌లు ఇలానే కోరుకున్నారా? అనేది ప్ర‌శ్న‌.

యువ నేత‌గా.. ప్ర‌జ‌ల మ‌ధ్య ప‌ట్టుమ‌ని ప‌ది రోజులుకూడా జ‌గ‌న్ లేర‌నేది.. అంద‌రికీ తెలిసిన సత్యం. అంతేకాదు.. పైగా యువ నాయ‌కుడుగా దేశాలు తిరిగి.. లేదా రాష్ట్రాలు తిరిగి ఆయ‌న ఏపీకి ఏం తీసుకువ‌చ్చార‌ని ప్ర‌శ్నించుకుంటే.. కూడా ఏమీ మిగ‌ల‌దు. ఈ నేప‌థ్యంలో ముస‌లి వ్య‌క్తే అయినా.. ముస‌లి నాయ‌కుడే అయినా.. ప‌నిచేసే నాయ‌కుడు త‌మ‌కు కావాల‌ని అనుకుంటే.. జ్యోతి బ‌సు మాదిరిగా.. చంద్ర‌బాబువైపు ప్ర‌జ‌లు మ‌న‌సు పెట్టుకుంటే.. అప్పుడు జ‌గ‌న్ పరిస్థితి ఏంటి? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.