నెల్లూరు వైసీపీ రాజకీయాలు మంచి కాక మీదున్నాయ్. తలపండిన నెల్లూరు పెద్దా రెడ్లు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిని పక్కన పెట్టిన తీరు నెల్లూరు పొలిటికల్ జనానికి తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. ఆనం వర్సెస్ కొత్త ఇంఛార్జ్ నేదురుమల్లి అన్నట్లుగా ఫైటింగ్ జరుగుతోంది. గతంలో తటస్థంగా ఉండే వారూ.. ఇప్పుడు ఏదో ఒకవైపు రాక తప్పడం లేదు. గ్రామాల్లో ఫ్యాక్షన్ పోకడలు పడగ విప్పుతున్నాయి. బాలాయపల్లి మండలం మన్నూరులో ఇటీవల గౌరీదేవి పూజలు జరిగాయి. ఆ కార్యక్రమంలో ఆనం, నేదురుమల్లి వర్గాలు ఘర్షణకు దిగి కొట్లాడుకున్నాయి. రాపూరులోనూ క్రీడా పోటీల విషయంలో రెండు వర్గాలు కాలుదువ్వుకున్నాయి. అలా పలు గ్రామాల్లో ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయాందోళనలు నెలకొన్నాయి.
ఫ్యాక్షన్ పోకడలకు జగన్ నిర్ణయమే ప్రధాన కారణమనే ఆరోపణలు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి. ఎక్కడైనా ప్రజలు ఎన్నుకున్నవారే ఎమ్మెల్యే.. వాళ్లు చెప్పినట్టే అధికారులు వింటుంటారు. ఎమ్మెల్యే ఆనంతో గిట్టలేదని.. కొత్తగా నేదురుమల్లిని తెచ్చిపెట్టడంపై ప్రజలు, అధికార యంత్రాంగంలో చర్చోపచర్చలు సాగుతున్నాయ్. ఎలెక్టెడ్ ఆనం.. సెలెక్టెడ్ నేదురుమల్లి అంటూ జనం సెటైర్లు వేస్తున్నారు. తాము ఆనంను ఎన్నుకుంటే.. సీఎం జగన్… నేదురుమల్లి చేతిలో పెత్తనం పెట్టడమేంటని జనం ప్రశ్నిస్తున్నారు. అటు.. అధికారుల పని అడకత్తెరలో పడ్డట్టు అయింది. కరవమంటే కప్పకి కోపం.. విడవమంటే పాముకి కోపం అన్న చందంగా తయారైంది.
ఆనంను పంపిచేస్తారా..
ఆనంను పార్టీ నుంచి సాగనంపేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ దిశగా వెంకటగిరి ఇంఛార్జ్ నేదురుమల్లి పావులు కదుపుతున్నారు. ఆనం పై భారీ డైలాగులు వదులుతున్నారు. పొమ్మన్నా పోకుండా పార్టీని పట్టుకు వేలాడుతున్నారని జనంలో రోజు కామెంట్లు చేస్తున్నారు. నియోజకవర్గంలో దారులు మూసుకుపోయేలా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆనం ఎక్కడ పోటీ చేసినా, ఎన్ని కోట్లు ఖర్చయినా ఆయన్ను ఓడించాలని జగన్ ఆదేశించినట్లుగా చెబుతున్నారు. నిజానికి.. ఆనంకు వెంకటగిరి, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్‌లో పట్టు ఉంది. ఎన్నికల్లో ఆనం ప్రభావం తప్పక ఉంటుందని నెల్లూరు జనం అంచనాలు వేస్తున్నారు. అందుకే ఆయన్ను ఎక్కడా గెలవకుండా చూడాలన్నది జగన్ తపన ..
ఆనం కూడా వైసీపీ అధినేత మంత్రాంగాన్ని అర్థం చేసుకున్నారు. ఇప్పుడే తొందరపడితే ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెడతారని అర్థం చేసుకున్నారు. దానితో ఉప ఎన్నికకు అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. అందుకే ఇప్పటికిప్పుడు ఆయన రాజీనామా చేయడం లేదని సన్నిహితులు అంటున్నారు. మరో పక్క ఇటీవల జగన్ చేయించిన సర్వేలో ఆనంకే విజయావకాశాలున్నట్లు వెల్లడైంది. నెదురుమల్లి ఎవరని జనం ప్రశ్నిస్తున్నారట. చూడాలి ఎం జరుగుతుందో…
This post was last modified on January 29, 2023 12:20 pm
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…