Political News

నీదో చెత్త ప్ర‌భుత్వం.. ముఖ్య‌మంత్రిన్నే ఏకేసిన స్వామీజీ!

ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించ‌డం త‌ప్పుకాదు. భావ‌ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ అంద‌రికీ ఉంటుంది. అయితే.. ప్ర‌భుత్వ పెద్ద‌ల ప‌క్క‌నే వారితో రాసుకునిపూసుకుని కూర్చుని వారిపై నిప్పులు చెరిగితే.. ఎలా ఉంటుంది? విమ‌ర్శ‌లు చేస్తే.. ఏం జ‌రుగుతుంది. అస‌లు ఈ దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు జ‌ర‌గ‌ని ఘ‌ట‌న ఒక‌టి క‌ర్ణాట‌క‌లో జ‌రిగింది. ముఖ్యమంత్రి పక్కన కూర్చున్న ఓ స్వామీజీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన సీఎం.. అంతే వేగంగా రియాక్ట్ అయ్యారు.

కర్ణాటకలోని మహదేవపురలో ఓ కార్యక్రమం జ‌రిగింది. ఈ కార్యక్రమంలో కాగినేలె మహాసంస్థాన కనక గురు పీఠాధిపతి ఈశ్వరనందపురి స్వామీజీతో పాటు ముఖ్య‌మంత్రి బ‌స‌వ‌రాజ బ‌మ్మై కూడా పాల్గొన్నారు. తొలుత స్వామిజీకి మైకు ఇచ్చారు. దీంతో ఆయ‌న రెచ్చిపోయారు. బెంగళూరులో సరైన మౌలిక సదుపాయాలు లేక నగరవాసులు పడుతున్న అవస్థలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు స్వామీజీ. అలాగే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో చెత్త పాల‌న సాగుతోంద‌న్నారు.

“బెంగళూరులో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. వరదలు వచ్చినప్పుడు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు వర్షాలు పడినప్పుడు మాత్రమే ఇక్కడకు వస్తున్నారు. ఇవన్నీ మేం చాలా కాలంగా చూస్తూనే ఉన్నాం. వర్షాలు పడుతున్నప్పుడు ప్రజలు ఇబ్బందులకు గురవకుండా ఏం చేయాలో అధికారులకు తెలియదా? సీఎం కూడా దీని గురించి గతంలో హామీలు ఇచ్చారు. అయినా.. ఒక్క‌టీ ప‌రిష్క‌రించ‌లేక పోయారు” అని స్వామీజీ నిప్పులు చెరిగారు.

అయితే.. ఈ వ్యాఖ్య‌ల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సీఎం బొమ్మై.. స్వామీజీ ఇంకా ఏదో మాట్లాడుతుండగానే మైకును చేతుల్లో నుంచి లాగేసుకున్నారు. “కేవలం హామీలు ఇచ్చి మర్చిపోయే ముఖ్యమంత్రిని కాదు నేను. అది కేవలం హామీ మాత్రమే కాదు. దానిపై మేం ఓ పథకం తీసుకొచ్చాం. నిధులు కూడా కేటాయించాం. పని జరుగుతోంది” అని విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. స్వామీజీ నుంచి సీఎం మైకును లాక్కుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కర్ణాటకలో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. ఈ ఘటన ఆసక్తికరంగా మారింది.

This post was last modified on January 27, 2023 9:03 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

1 hour ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

2 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

2 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

2 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

4 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

4 hours ago