ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు మంచివే అని కొందరు.. కాదు.. ప్రజా కంటకమని మరికొంద రు చెబుతున్నారు. ఇక, వీటిపై కోర్టులకు ఎక్కిన వాటిని గమనిస్తే.. అక్కడ తీర్పులను పరిశీలిస్తే.. పంటి కింద రాళ్లు తగులుతున్నాయి. మరి ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ పరిణామాలు పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా.. వ్యక్తిగతంగా సీఎం జగన్‌కు ఇబ్బందిని తీసుకువస్తున్నాయి.
నిజానికి ఆది నుంచి కూడా కొన్ని దూకుడు నిర్ణయాల కారణంగా సీఎం జగన్ అభాసుపాలయ్యారు. ప్రజా వేదికను కూల్చడం మంచిదని ఆయన చెప్పారు. పర్యావరణాన్ని పట్టించుకోకుండా చేసిన ఈ నిర్మాణం సరికాదన్నారు. అయితే.. తదనంతరం.. ఇలా చేసిన నిర్మాణాల్లో ఒక్క దాన్ని కూడా ఆయన కూల్చలేక పోయారు. ఇక, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేశారు. ఇది కూడా విమర్శలకు తావిచ్చింది.
మరీ ముఖ్యంగా అప్పటి సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను హఠాత్తుగా ట్రాన్స్‌ఫర్ చేయడం.. మరో వివాదం. ఇక, రాష్ట్ర ఎన్నికల సంఘంతో వివాదం పెట్టుకుని రచ్చకెక్కారు. ఇవన్నీతొలి దశ పరిణామాల్లో సీఎం జగన్‌కు మాయని మచ్చలుగా మారిపోయాయి. ఇక, ఇటీవల కాలంలో తీసుకున్న నిర్ణయాల్లో ప్రజల రక్షణ.. అదే పర్యావరణ హితం ఉన్నప్పటికీ.. ప్రజాభిప్రాయాన్ని సేకరించకుండా తీసుకున్న నిర్ణయాలు కావడంతో అవికూడా అభాసుపాలయ్యాయి.
ఒకటి ఫ్లెక్సీలపై నిషేధం. దీనిని చాలా ఆర్భాటంగా అప్పటికప్పుడు. ఒక కలెక్టర్ చెప్పారన్న కారణంగా సీఎం జగన్ ఓ సభలో ప్రకటించారు. కానీ నేడు డిజిటల్ యుగంలో అన్నీ ఫ్లెక్సీలపైనే ప్రచారం జరుగు తోంది. దీనిపై ఆధారపడి కొన్ని వేల కుటుంబాటు జీవిస్తున్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకోకుండా.. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం వివాదమైంది.
ఇక, జీవో 1 ద్వారా.. కందుకూరు, గుంటూరు వంటి ఘటన లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామ ని చెబుతున్నా.. ఇది కూడా న్యాయం ముందు నిలవడం లేదనే టాక్ వినిపిస్తోంది.ఇలాంటి వాటివల్ల సీఎం జగన్ ఎన్ని చేసినా.. ఆయనకు అనుభవం లేదనే వాదన బలపడుతుండడం ఇటు పార్టీకి.. అటు వ్యక్తిగతంగా ఆయనకు కూడా మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates