అవును.. రాజకీయాల్లో నాయకులకు వ్యూహాలు లేకుండా.. ముందు ఆలోచన లేకుండా ఏ పనినీ చేయరు, చేయబోరు. ఇది.. ఇప్పుడు జనసేనలోనూ కనిపిస్తోంది.గత ఎన్నికల్లో జనసేన తరఫున ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పార్టీ కీలక నాయకుడు నాగబాబు తాజాగా.. సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని అన్నారు.
అయితే.. దీనికి ముందు అందరూ కూడా టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంటే.. ఖచ్చితంగా నరసాపురం టికెట్‌ను నాగబాబుకు కేటాయిస్తారు.. ఆయన గెలుపు కూడా నల్లేరుపై నడకేనని లెక్కలు వేసుకున్నారు. ఎందుకంటే.. గతంలో ఒంటరిగా పోటీ చేసినప్పుడు కూడా.. బలమైన ఓటు బ్యాంకుతో నాగబాబు దూసుకు పోయారు. కానీ, ఇప్పుడు ఆయన ఏకంగా పోటీకి దూరంగా ఉంటున్నట్టు ప్రకటించారు.
ఇక, ఈ అనూహ్య పరిణామం వెనుక.. కీలక రీజన్ ఉందని అంటున్నారు పరిశీలకులు. నాగబాబు.. పోటీకి రెడీ అయ్యారని.. అయితే, పొత్తుల నేపథ్యంలో నరసాపురం టికెట్‌ను టీడీపీనే తన దగ్గర అట్టేపెట్టుకునే వ్యూహం అమలు చేస్తోందని.. ఎందుకంటే.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున నరసాపురం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు.
అంతేకాదు, దీనికి సంబంధించిన డీల్ కూడా ఓకే అయిందని.. అందుకే నాగబాబును అక్కడి నుంచి తప్పించారని అందుకే ఆయన ఎన్నికలకు దూరమవుతున్నట్టు ప్రకటించారని అంటున్నారు. ఇదేసమ యంలో ఆయనకు రాజ్యసభ సీటును కూడా ఖరారు చేశారని.. ఇది కూడా డీల్‌లో భాగంగానే ఖరారైందని అంటున్నారు. ఏదేమైనా.. నాగబాబు నిర్ణయం వెనుక వైసీపీ రెబల్ నేత కోసం.. చేస్తున్న త్యాగం ఉందని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates