Categories: Political News

పోల‌వ‌రంలో త‌మ్ముళ్ల ఫైట్‌.. సూప‌ర్‌!

ఏపీలో నిఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గం పోల‌వ‌రం. ఇక్క‌డ కాంగ్రెస్ సంస్థాగ‌త ఓటు బ్యాంకు ఎక్కువ‌గా ఉంది. ఈ క్ర‌మంలోనే 2004, 2009 వ‌రుస ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ విజ‌యం ద‌క్కించుకుంది. త‌ర్వాత‌.. చంద్ర‌బాబు దూకుడు, ఆయ‌న చేసిన వ‌స్తున్నా మీకోసం యాత్ర కార‌ణంగా ఇక్క‌డ పార్టీ పుంజుకుంది. ఈ క్ర‌మంలోనే 2014 ఎన్నిక‌ల్లో మొడియం శ్రీనివాస‌రావు విజ‌యం ద‌క్కించుకు న్నారు.

పార్టీ అధికారంలోకి రావ‌డంతో.. మొడియం గెలిచీ గెలవ‌గానే గల్లా పెట్టె తెరిచేశార‌ని అప్ప‌ట్లో పెద్ద వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. అంతేకాదు..తాను తీసుకునే ముడుపుల్లో త‌నకొక్క‌డికే కాద‌ని.. ఎంతో మందికి వాటా ఉంద‌ని.. మీడియా మిత్రుల‌కు కూడా ఇచ్చాన‌ని 2015లో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు పార్టీకి తీవ్ర డ్యామేజీ చేశాయి. ఈ క్ర‌మంలో జోక్యం చేసుకున్న అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు ఆయ‌న‌ను కొన్నాళ్ల పాటు మౌనంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు.

త‌ర్వాత ఏమైందో ఏమో.. 2019 ఎన్నిక‌ల స‌మ‌యానికి మొడియం అడ్ర‌స్ క‌నిపించ‌లేదు. ఈ క్ర‌మంలోనే బొర‌గం శ్రీనివాస‌రావు అనే మ‌రో నాయ‌కుడికి టికెట్ ఇచ్చారు. అయితే, ఈయ‌న ప్ర‌భావం ఇక్క‌డ క‌నిపించ‌లేదు. దీంతో భారీ మెజారిటీతో వైసీపీ నాయ‌కుడు తెల్లం బాల‌రాజు విజ‌యం ద‌క్కించుకున్నారు. క‌ట్ చేస్తే.. వైసీపీ విధానాలు కావొచ్చు. పోల‌వ‌రం నిర్వాసితుల స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కాక‌పోవ‌డం కావొచ్చు.. ఏదైనా కూడా ఇక్క‌డ వైసీపీ హ‌వా త‌గ్గింది.

ఈ నేప‌థ్యంలో వైసీపీ ఓటు బ్యాంకును త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు టీడీపీ అవ‌కాశం ద‌క్కింది. కానీ, ఆదిశ‌గా పార్టీ ప్ర‌య‌త్నాలు చేయ‌డం లేదు. ఎందుకంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మకంటే త‌మ‌కే టికెట్ ద‌క్కుతుందని మొడియం వ‌ర్సెస్ బొర‌గంల మ‌ధ్య రాజ‌కీయ యుద్ధం సాగుతోంది. పోనీ.. పార్టీ త‌ర‌ఫున కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారా? అంటే అది కూడా లేదు. దీంతో వైసీపీ వ్య‌తిరేక‌త ఉన్న‌ప్ప‌టికీ.. దానిని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునే ప‌నిని ఈ నేత‌లు చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Share

Recent Posts

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

2 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

3 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

3 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

3 hours ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

6 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

6 hours ago