Movie News

విజ‌య్ స‌రైన‌ సినిమా చేసుంటే…

త‌మిళ సినిమాల్లో నంబ‌ర్ వ‌న్ స్థాయిలో ఉంటూ రాజ‌కీయాల వైపు అడుగులేసిన విజ‌య్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన చివ‌రి చిత్రం.. జ‌న‌నాయ‌గ‌న్. ఆయ‌న‌కు ఎవ‌రు స‌ల‌హా ఇచ్చారో ఏమో కానీ.. లాస్ట్ మూవీ కోసం ఒక రీమేక్‌ను ఎంచుకున్నారు. ఎంచుకుంటే ఎంచుకున్నాడు దాన్ని ఉన్న‌దున్న‌ట్లుగా తీసి ఉన్నా బాగుండేది. కానీ భ‌గ‌వంత్ కేస‌రి లాంటి మంచి క‌థ‌ను చెడ‌గొట్టి అర్థం ప‌ర్థం లేని పాత్ర‌లు, ట్రాక్‌లు జోడించారు. వాటి వ‌ల్ల సినిమా పేల‌వంగా త‌యారైంది.

అస‌లే సినిమా బాలేదంటే.. అది విప‌రీతంగా ఆల‌స్యం అయింది. పైగా ఆన్ లైన్లో ముందే లీక్ అయింది. ఇవ‌న్నీ చాల‌వ‌న్న‌ట్లు ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ను నిరుత్సాహ‌ప‌రిచేలా సినిమాకు ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చారు. ఇన్ని ప్రతికూలతను అధిగమించి సినిమా రిలీజైతే బ్యాడ్ టాక్ వచ్చింది. అయినా సరే.. కేవలం విజయ్ స్టార్ పవర్ సినిమాను కాపాడుతోంది.

వీకెండ్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ రూ.200 కోట్లకు దగ్గరగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఎన్నో ప్రతికూలతల మధ్య రిలీజై, బ్యాడ్ టాక్ తెచ్చుకున్న సినిమాతో ఇలాంటి వసూళ్లు రాబట్టడం విజయ్‌కే చెల్లింది.
ఒకవేళ విజయ్ తన చివరి చిత్రం కోసం రీమేక్ మీద ఆధారపడకుండా, స్ట్రెయిట్ మూవీ చేసి ఉంటే, అందులో బలమైన కంటెంట్ ఉండుంటే.. ఆ చిత్రం బాక్సాఫీస్ ఎలాంటి అద్భుతాలు చేసేదో ఊహించడం కూడా కష్టమే.

‘జననాయగన్’ తీసిన హెచ్.వినోద్ మంచి విషయం ఉన్న దర్శకుడే. కెరీర్ ఆరంభంలో శతురంగ వేట్టై, ఖాకి చిత్రాలతో అతను గొప్ప పేరు సంపాదించాడు. విజయ్ అభిరుచికి, రాజకీయ ప్రయోజనాలకు తగ్గట్లుగా ‘భగవంత్ కేసరి’ని రీమేక్ చేయడంలో అతను తీవ్రంగా తడబడ్డాడు.
వినోద్‌కు స్వేచ్ఛనిచ్చి స్ట్రెయిట్ మూవీనే చేయించి ఉంటే కచ్చితంగా విజయ్‌‌ వీడ్కోలు సినిమాను మరపురానిదిగా మార్చేవాడే.

తుపాకి, కత్తి, మెర్సల్ స్థాయిలో విజయ్ బలమైన కంటెంట్ ఉన్న సినిమా చేసి ఉంటే మాత్రం తమిళ సినిమాల కలెక్షన్ల రికార్డులన్నీ బద్దలైపోయేవి. కోలీవుడ్‌కు తొలి వెయ్యి కోట్ల సినిమా కూడా దక్కి ఉన్నా ఆశ్చర్యం లేదు. ‘లియో’ లాంటి మూవీతోనూ రూ.600 కోట్ల వసూళ్ల మార్కును అందుకున్న ఫాలోయింగ్ విజయ్‌ది. అలాంటిది సినీ రంగానికి గుడ్‌బై చెబుతూ ఒక బ్లాక్‌బస్టర్ మూవీ చేసి ఉంటే ఆ చిత్రం మామూలు సంచలనం అయ్యేది కాదు.

This post was last modified on July 27, 2026 10:43 am

Share

Recent Posts

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

2 hours ago

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

4 hours ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

5 hours ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

7 hours ago

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

7 hours ago

రామాయణ అలసత్వం వల్ల ఎవరికి లాభం

సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…

9 hours ago