సంక్రాంతి సినిమాల విడుదల తేదీల గురించి జనవరి ప్రారంభంలో జరిగిన రచ్చ చర్చా అంతా ఇంతా కాదు. ముఖ్యంగా వాల్తేరు వీరయ్య జనవరి 13 రావడం పట్ల మెగాభిమానులు ముందు నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. తీరా చూస్తే ఇప్పుడు వంద కోట్ల షేర్ తో రెండో వారంలోనూ మెగాస్టార్ దూకుడు మాములుగా లేదు. వీరసింహారెడ్డి నుంచి వచ్చిన పోటీని, థియేటర్ల కౌంట్ తగ్గడం వల్ల ఎదురైన ప్రతికూలతని ఈజీగా దాటేసింది. 11నే రావాల్సిందని తెగ ఫీలైన ఫ్యాన్స్ ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారు. ఒకవేళ ఫలితం తేడా కొట్టి ఉంటే అప్పుడా నిందని మెగాస్టార్ తో మైత్రి సంస్థ మోయాల్సి వచ్చేది.
వారసుడుని ముందు అనుకున్న డేట్ కంటే మూడు రోజులు ఆలస్యంగా అందరికంటే చివరిగా 14కి రిలీజ్ చేయడం నిర్మాత దిల్ రాజుకు చాలా ప్లస్ అయ్యింది. తమిళ వెర్షన్ టాక్ తాలూకు ప్రభావం తెలుగులో ఉంటుందని తెలిసినా కూడా రిస్క్ తీసుకున్నారు. ఒకవేళ 11నే వస్తే తర్వాత చిరంజీవి బాలకృష్ణ చిత్రాలకు వచ్చే టాక్ ఇబ్బందిగా మారుతుందని ముందే గుర్తించి దానికి అనుగుణంగా సరైన నిర్ణయం తీసుకున్నారు. కట్ చేస్తే రొటీన్ టాక్, సోసో రివ్యూలతో కూడా విజయ్ బ్రేక్ ఈవెన్ అందుకునేలా ఉన్నాడు. బాక్సాఫీస్ వద్ద అనూహ్య పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఇవి ఉదాహరణ.
దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఒకటుంది. లేట్ వచ్చినా త్వరగా వచ్చినా ఫలితాలను ముందస్తుగా అంచనా వేయడం అంత సులభం కాదు. ఒకవేళ కంటెంట్ కనక జనానికి సరిగ్గా కనెక్ట్ అయితే కౌంట్ తో సంబంధం లేకుండా కలెక్షన్లు వచ్చి పడతాయనే క్లారిటీ వచ్చేసింది. ఇది ఈ పండగ సీజన్ కు మాత్రమే కాదు అన్నిసార్లు వర్తిస్తుంది. రాబోయే వేసవిలో ఇలాంటి పరిస్థితులు మళ్ళీ రిపీట్ అయ్యే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. దసరాకు దీపావళికి క్లాషులు తప్పవు. ఒకే రోజు తలపడకుండా ముందు వెనుక అడ్జస్ మెంట్లు చేసుకోవడం మేలే జరుగుతుందని వీరయ్య వారసుడు నిరూపించాయి.
This post was last modified on January 22, 2023 11:53 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…