చాలా మంది అన్నదమ్ములు, తల్లీ కుమార్తెలు కూడా రాజకీయం చేస్తున్నారు. అయితే.. అందరూ ఒకే పార్టీలో ఉన్నారు. ఉదాహరణకు ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒంగోలులో దామచర్ల జనార్దన్, సత్యలు టీడీపీలోనే ఉన్నారు. శ్రీకాకులంలో ప్రతిభా భారతి, గ్రీష్మలు కూడా టీడీపీలోనే ఉన్నారు. అయితే.. వైసీపీ విషయానికి వస్తే మాత్రం కొంత భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది.
వైసీపీలో ఉన్న వారిలో ఒకరు టీడీపీలో ఉంటే.. మరొకరు వైసీపీలో ఉన్నారు. దీంతో రాజకీయాలు ఎలా సాగుతాయనేది ప్రశ్న. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన బీద సోదరుల విషయాన్ని తీసుకుంటే.. బీద మస్తాన్ రావు.. బీఎంఆర్ సంస్థలకు అధినేత. ఈయన సోదరుడు బీద రవిచంద్ర యాదవ్ కూడా ఈ సంస్థకు భాగస్వామి. అయితే.. గత ఎన్నికల వరకు కూడా ఇద్దరూ టీడీపీలోనే ఉన్నారు.
అయితే, గత ఎన్నికల్లో నెల్లూరు ఎంపీ స్థానం నుంచి ఓడిపోయిన మస్తాన్ రావు.. ఆవెంటనే వచ్చి వైసీపీ కండువా కప్పుకొన్నారు. ఈ క్రమంలోనే ఆయనకు కొన్నాళ్ల కిందట రాజ్యసభ సీటును కూడా ఆఫర్ చేశారు. సరే.. ఇప్పటి వరకు ఎలాగోలా గడిచిపోయిన రాజకీయం.. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యం లో మస్తాన్‌రావును ఇరకాటంలోకి నెట్టిందని అంటున్నారు పరిశీలకులు.
వచ్చే ఎన్నికల్లో నెల్లూరులో పార్టీని గెలిపించే బాధ్యతను మస్తాన్‌రావుకు అప్పగించాలని అధిష్టానం చూస్తోంది. ఆర్థికంగా బలంగా ఉండడం.. చేతిలో రాజ్యసభ సీటు ఉండడంతో ఆయనకు ప్రత్యక బాధ్యతలు అప్పగించే యోచనలో ఉంది. మరోవైపు.. రవిచంద్ర ఇప్పటికే జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈయనకు కూడా టీడీపీ జిల్లాలోని కొన్ని మెజారిటీ స్థానాలను గెలిపించే బాధ్యత అప్పగించాలని చూస్తోంది.
దీంతో ఇద్దరు అన్నదమ్ములురాజకీయ సుడిలో చిక్కకుకున్నట్టు అయింది. ఇది.. వైసీపీకి నష్టం చేకూరుస్తుందనిపరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు టీడీపీలో ఉన్న మస్తాన్‌రావు వెంట వైసీపీలో నడిచేందుకు ఆయన అనుచరులు రెడీగా లేకపోవడమే దీనికి కారణం. మరి ఆయన ఏం చేస్తారో.. చూడాలి.