‘సంబ‌రాల రాంబాబు గురించే బాబు నేను మాట్లాడుకున్నాం’

శ్రీకాకుళంలో నిర్వ‌హించిన యువ‌శ‌క్తి స‌భ‌లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ దుమ్మురేపారు. వైసీపీ నేత‌ల‌పై షాకింగ్ కామెంట్లు చేశారు. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో తాను హైద‌రాబాద్‌లో కలిసినప్పుడు వైసీపీ వెధవలు అందరూ ఏం మాట్లాడుకున్నారంటూ.. ప్ర‌శ్నించార‌ని.. ఈ వెధ‌వ‌ల‌కు తెలియ‌దు.. నేను చాలా విష‌యాలే చ‌ర్చించాన‌ని.. ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.

“అరేయ్ వెధవల్లారా నేను అమ్ముడు పోయే వ్య‌క్తిని కాదురా.. 20 కోట్లు టాక్స్ కట్టే సత్తా ఉన్న వాడిని. ప్యాకేజీ కాదు.. మీ వోల్టేజీ తీసేసే వాడిని. వైజాగ్‌లో నా పార్టీ నేత‌ల‌పైనా.. కార్య‌క‌ర్త‌ల‌పై దాడులు జ‌రిగిన‌ సంఘటనకు చంద్ర‌బాబు నాకోసం నిల్చున్నాడు. ఆయనకి కుప్పంలో జ‌రిగిన ఘ‌ట‌న‌కు సంబంధించి సాలిడారిటీ చూపించడం నా బాధ్యత. అందుకే హైద‌రాబాద్‌లో స్వ‌యంగా నేనే ఆయ‌న ఇంటికి వెళ్లా” అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.

“రెండు గంటలు ఏం మాట్లాడుకున్నారు అని తెగవాగారు ఇప్పుడు చెప్తున్నా ఏం మాట్లాడుకున్నాం. కానీ, చాలా విష‌యాలు మాట్లాడుకున్నాం. సంబరాలు రాంబాబు గురించి 23 నిమిషాల రెండు సెకండ్లు మాట్లాడుకున్నాం. 18 నిమిషాలపాటు మన రాష్ట్రాన్ని 15వ స్థానంలో పెట్టాడు ఏంటి అని మూడుముక్క‌ల ముఖ్య‌మంత్రి గురించి మాట్లాడుకున్నాం” అని ప‌వ‌న్ అన్నారు.

“లా అండ్ ఆర్డర్ ఎందుకు చితికిపోయింది ఏం చేయాలి.. అని ఓ 30 నిమిషాలు మాట్లాడుకున్నాం. ఇలా మాట్లాడే కొద్దీ తీసుకొస్తూనే ఉన్నాయి అలా గంటన్నర అయింది. ఓ పదిహేను నిమిషాలు స్నాక్స్ కోసం గడిచాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉండాలి అని మాట్లాడుకున్నాం..” అని ప‌వ‌న్ వెల్ల‌డించారు.