వైసీపీ అధిష్టానం.. ఒక ఎమ్మెల్యేపై చాలా సీరియస్ అయిందనే ప్రచారం తాడేపల్లి వర్గాల్లో సాగుతోంది. ఇటీవలే..ఈయనను స్వయంగా సీఎం జగన్ తన నివాసానికి పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటి కీ.. ఆయనలో మార్పు రాకపోవడంతో తాజాగా కీలక సలహాదారు ఒకరు.. స్వయంగా ఫోన్ చేసి.. ఏం చూసి మిడిసిపాటు? అని ప్రశ్నించినట్టు తాడేపల్లి వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన సదరు ఎమ్మెల్యే గత ఎన్నికల్లో అనూహ్యంగా టీడీపీ నుంచి వచ్చి.. వైసీపీ లో చేరారు. ఈ క్రమంలో ఆయన వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపుగుర్రం ఎక్కారు. కొన్నాళ్లుగా సొంత పార్టీ మంత్రి తో విభేదిస్తున్న ఆయన.. తరచుగా.. వివాదాలకు కేంద్రంగా మారారు. ఈ క్రమంలోనే ఇటీవల సీఎం జగన్ స్వయంగా మాట్లాడి.. నోరు అదుపులో పెట్టుకోవాలని.. సూచించారని.. పార్టీ కోసం పనిచేయాలని సూచించినట్టు ప్రచారం జరిగింది.
అయితే.. ఇంతలోనే.. గుంటూరులో జరిగిన తొక్కిసలాట ఘటన సహా.. తాజాగా పవన్ -చంద్రబాబుల భేటీపై వైసీపీ లైన్‌కు విరుద్ధంగా ఆయన వ్యవహరించడం , వ్యాఖ్యలుచేయడంపై పార్టీ అధిష్టానం చాలా సీరియస్‌గా ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించి గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే.. ఇంతలోనే ఆయన మరోసారి మీడియా ముందుకు వచ్చి.. పవన్-చంద్రబాబుల భేటీకి సానుకూలంగా మాట్లాడడంతో అధిష్టానం సీరియస్ అయిందని అంటున్నారు.
ఏం చూసి మిడిసిపాటు? ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకో. ఇతర ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారు? మీరెలా ఉన్నారు? అని కీలక సలహాదారు తీవ్రంగా వ్యాఖ్యానించినట్టు ఇటు నియోజకవర్గంలోనూ.. అటు తాడేపల్లి వర్గాల్లోనూ చర్చనడుస్తోంది. ఇదిలావుంటే.. వైసీపీని కాదంటే.. ఈయనకు టికెట్ ఇచ్చే నాయకులు కానీ, పార్టీకానీ లేకపోవడం గమనార్హం.
This post was last modified on January 10, 2023 5:27 pm
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…