ఇప్ప‌టికి ఇంతే.. మాట వినండి ప్లీజ్‌.. జ‌గ‌న్ విన్న‌పాలు

“అవును.. ఇప్ప‌టికి ఇంతే.. మాట వినండి!” అని ఉత్త‌రాంధ్ర‌కు చెందిన కీల‌క నాయ‌కుడికి సీఎం జ‌గ‌న్ చెప్పిన‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాల్లో గుస‌గుస వినిపిస్తోంది. ఉత్త‌రాంధ్ర‌కు చెందిన ఒక‌రిద్ద‌రు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ వార‌సుల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని కొన్నాళ్లుగా సీఎం జ‌గ‌న్ ద‌గ్గ‌ర మొర‌పెడుతున్నారు. అయితే.. సీఎం జ‌గ‌న్ మాత్రం వారి వాద‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు.

చాలా మంది నాయ‌కులు.. త‌మ త‌మ వార‌సులను రంగంలోకి దింపాల‌ని భావిస్తున్నారు. పేర్ని నాని.. అయితే. దూకుడుగా ఉన్నారు. ఇక‌, జ‌గ‌న్ ప్ర‌మేయంతో సంబంధమే లేద‌న్న‌ట్టుగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫా త‌న పుత్రిక‌ను ప్ర‌క‌టించేశారు. ఇక‌, చాలా మంది రెడీగా ఉన్నారు. కొంద‌రు జ‌గ‌న్ ఒప్పుకుంటార‌ని భ‌రోసాగా ఉండ‌డంతో త‌మ వారిని ప్ర‌చారంలోకి కూడా దింపేస్తున్నారు.

దీంతో ఈ విష‌యం అధిష్టానం ద‌గ్గ‌ర చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఈ విష‌యంలో ఏం చేయాల‌నేది పార్టీ సీరియ‌స్‌గానే చ‌ర్చించిన‌ట్టు తెలిసింది. ఇప్ప‌టికి వ‌ర‌కు అయితే.. వార‌సుల‌కు టికెట్లు ఇచ్చేది లేద‌ని.. అత్యంత ముఖ్యం.. త‌ప్ప‌దు అనుకున్న ఒక‌టి రెండు స్థానాల్లో త‌ప్ప‌.. మిగిలిన వాటిలో ఎట్టి ప‌రిస్థితిలోనూ ఒప్పుకొనేది లేద‌ని కూడా సీఎం జ‌గన్ స్ప‌ష్టం చేసిన‌ట్టు స‌మాచారం.

ఇదే విష‌యాన్ని కీల‌క స‌ల‌హాదారు.. ఉత్త‌రాంధ్ర‌కు చెందిన ముఖ్య‌నాయ‌కుడికి స‌మాచారం ఇచ్చార‌ని తెలిసింది. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న మాత్రం పంతం ప‌ట్టి కూర్చున్నార‌ని.. అంటున్నారు. అలాగ‌ని.. తిరుగుబాటు చేసే ప‌రిస్థితి లేద‌ని కూడా అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.