వైసీపీలో చేరి తప్పు చేశా.. టీడీపీ నేత కాళ్లు ప‌ట్టుకున్న వైసీపీ నేత‌

ప్ర‌స్తుతం ఏపీ అధికార పార్టీలో ఉన్న చాలా మంది అసంతృప్తి, అస‌హ‌నంతోనే కాలం వెళ్ల‌దీస్తున్నారు. పార్టీ కోసం.. Jaganను సీఎం చేసేందుకు.. తాము ఎంతో క‌ష్ట‌ప‌డ్డామ‌ని కొంద‌రు, తాము ఎంతో ఖర్చు చేశామ‌ని మ‌రికొంద‌రు చెబుతున్నారు. అయితే, ప్ర‌భుత్వం వ‌చ్చినా.. త‌మ‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నం లేకుండా పోయింద‌ని.. కొత్త‌గా వ‌చ్చిన వారినే అక్కున చేర్చుకుంటున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో కొంద‌రు త‌మ అసంతృప్తిని బాహాటంగానే వెళ్ల‌గ‌క్కుతున్నా.. మ‌రికొంద‌రు మాత్రం మ‌న‌సులో దాచుకుని స‌మ‌యం కోసం వేచి చూస్తున్నారు. తాజాగా అనంత‌పురం జిల్లాలోనూ ఇలాంటి ఒక నేత రోడ్డున ప‌డ్డాడు. YCPలోకి చేరి తప్పు చేశా.. అంటూ ముచ్చురామి రామాంజనేయులు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో అకస్మాత్తుగా ఆయ‌న టీడీపీ సీనియ‌ర్ నాయ‌కురాలు, మాజీ మంత్రి పరిటాల సునీత కాళ్లు పట్టుకున్నారు.

అనంతపురం జిల్లా రాప్తాడు మండలం మరూరు గ్రామంలో మాజీ మంత్రి Paritala Suneetha ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ఇళ్ల వద్దకెళ్లి, ప్రభుత్వ వైఫల్యాలను మహిళలు, ప్రజలకు వివరించారు. అందులో భాగంగా వైసీపీ నేత‌ ముచ్చుమర్రి రామాంజనేయులు ఇంటి వద్దకు పరిటాల సునీత వెళ్లారు. ఆయన వెంటనే పరిటాల సునీత కాళ్లు పట్టుకున్నారు.

‘నన్ను క్షమించమ్మా 2019 ఎన్నికల సమయంలో వైసీపీలోకి చేరి తప్పు చేశానమ్మా’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనను పరిటాల సునీత వెంటనే పైకి లేవదీసి.. ‘మనది తెలుగుదేశం పార్టీ’ అని ఆప్యాయంగా పలకరించారు. TDP అందరికీ అవకాశం ఇస్తుందన్నారు. అనంతరం రామాంజనేయులుకు పార్టీ కండువా కప్పి, ఆహ్వానించారు. రామాంజనేయులు మాట్లాడుతూ టీడీపీ బలేపేతానికి కృషి చేస్తానన్నారు. ఇక‌, ఇలా ఎంత మంది ఉన్నారో చూడాలి.