ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత Chandrababu తెలంగాణలో అడుగు పెట్టడం.. ఖమ్మంలో సభ పెట్టి కామెంట్లు చేయడంపై తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్న నేపథ్యంలో చంద్రబాబుకు మద్దతుగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే Jagga Reddy అదిరిపోయే కామెంట్లు చేశారు. KCR ఇచ్చిన అవకాశంతోనే చంద్రబాబు తెలంగాణలోకి వచ్చారని అన్నారు. TRS అనే మాటను తన పార్టీ నుంచి తొలగించి.. BRS చేసినప్పుడే.. కేసీఆర్ చంద్రబాబుకు అవకాశం ఇచ్చేశారని అన్నారు.
పార్టీ పేరు నుంచి తెలంగాణ తొలగించడంతో కేసీఆర్ బలం పోయిందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో ఏపీలో రాజకీయాలు చేసేందుకు వెళ్తున్నారు కాబట్టే.. చంద్రబాబు కూడా తెలంగాణలోకి అడుగులు వేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు ఇకపై కేసీఆర్తో చెడుగుడు ఆడుకుంటారని జగ్గారెడ్డి తీవ్ర సంచలన వ్యాఖ్యలుచేశారు. తెలంగాణ వాదాన్ని కేసీఆర్ చంపేశారని మండిపడ్డారు.
సైలెంట్‌గా ఉన్న చంద్రబాబును రాష్ట్రానికి రావడానికి ముఖ్యమంత్రి అవకాశం కల్పించారని ఆరోపించారు. కేసీఆర్ ఏపీలో అట్రాక్ట్ చేయలేరని.. బాబు మాత్రం ఇక్కడ రాజకీయాల్లో ప్రభావం చూపుతారని ఆయన అన్నారు. ఇకపై Telanganaలో సీరియస్ రాజకీయాలు నడుస్తాయని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత మైనార్టీలకు రుణాలివ్వడం ప్రభుత్వం మర్చిపోయిందని ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం మైనార్టీలకు కేటాయించిన రూ. 120 కోట్లను కనీసం రూ. 1500 కోట్లకు పెంచాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.