ఏపీలో వచ్చే 2024లో జరగనున్న ఎన్నికల్లోనే అధికారంలో వచ్చేస్తామని జనసేన చెబుతున్న విషయం తెలిసిందే. అయితే.. దీనికి విరుద్ధంగా.. పార్టీలో అంతర్గత చర్చ ఒకటి జరుగుతోంది. ఇప్పటికి ప్పుడు అధికారం రాకున్నా రాకపోయినా.. 2029 ఎన్నికలను టార్గెట్ చేసుకుని.. ఇప్పటి నుంచి పునాదులు బలంగా వేసుకునే వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు నాయకులు గుసగుసలాడుతున్నారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితిని గమనిస్తే.. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో జనసేనను పోటీకి పెట్టేందుకు అభ్యర్థులు లేరు. సో.. ఇప్పుడు టీడీపీతో జతకట్టినా.. 40 లోపు స్థానాలు మాత్రమే దక్కుతాయి. వీటిలో బలమైన స్థానాలను ఎంచుకుని.. ఐదు నుంచి ఆరు జిల్లాలను టార్గెట్ చేసుకుని.. పార్టీని బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు చెబుతున్నారు. ఇవి శ్రీకాకుళం, విజయనగరం, విజయవాడ, గుంటూరు.. కర్నూలు, అనంతపురం, ఉభయ గోదావరి జిల్లాలుగా ఉన్నట్టు లెక్కులువేస్తున్నారు.
ఆయా జిల్లాల్లో ముందు పునాదులు బలంగా వేసుకుని వచ్చే 2029 టార్గెట్‌గా శ్రీకారం చుట్టనున్నట్టు పెద్ద ఎత్తున నాయకులు చెబుతున్నారు. కనీసం 25-30 మందిని గెలిపించుకుంటే.. చాలు రాష్ట్రం లో 2029 నాటికిబలమైనశక్తిగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందని పవన్ ఆలోచన చేస్తున్నట్టు కూడా చెబుతున్నారు. వారి ద్వారా ప్రజల మనసుల్లో పాగా వేయాలనేది వీరి వ్యూహంగా ఉందని అంటున్నారు.
తాము పెట్టుకున్న లక్ష్యంలో ఒకవేళ ఎక్కడైనా ఒకటి రెండు సీట్లుతగ్గినా.. మిగిలిన సీట్లను గెలుచుకుని ..అసెంబ్లీలో గట్టి వాయిస్ వినిపించడంతోపాటు.. 2029 నాటికి బలహీనమయ్య పార్టీని తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేయొచ్చని.. అంటున్నారు. ఇప్పటికిప్పుడు మాత్రం ఖచ్చితంగా 25నుంచి 30 సీట్ల లో గెలుపు ఖాయం దిశగా ప్రచారం ఉంటుందని చెబుతున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates