ఏపీలో చిత్రమైన రక్తదానానికి తెరదీసింది ప్రభుత్వం. రక్తదానం.. అంటేనే పేరులో ఉన్నట్టు స్వచ్ఛందంగా ఎవరికి వారు ముందుకు వచ్చి చేసే దానం. దీనిలో ఎవరి బలవంతం కూడా ఉండదు. ఇచ్చేవారి ఇష్టం.. ఆధారంగా చేసుకునే తీసుకునేవారు ముందుకు రావాలి. అయితే, ఏపీలో మాత్రం దీనికి భిన్నంగా ప్రభుత్వమే బలవంతపు రక్త దానానికి తెరదీయడం.. ఆశ్చర్యంగానేకాదు.. ఆవేదనకు కూడా దారితీస్తోంది.
ఈ నెల 21(బుధవారం) సీఎం జగన్ 50వ పుట్టిన రోజు. దీనిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకోవాలని.. వైసీపీ నేతలు భావించారు. పార్టీ వరకు అయితే.. దీనికి ఎవరూ అడ్డు చెప్పరు. అయితే.. పార్టీకి అతీతంగా.. ప్రభుత్వ పరంగా కూడా దీనిని నిర్వహించాలని భావించడం.. ఉద్యోగులనుంచి బలవంతపు రక్త సేకరణకు పూనుకోవడం.. తీవ్ర వివాదానికి దారితీసింది.
ఉభయ గోదావరి జిల్లాల్లోని అన్ని మండలాల్లోనూ.. గత రెండు రోజుల నుంచి ఉద్యోగులకు, వలంటీర్లకు.. రక్త దానంపై ఒత్తిడి పెరిగిపోయింది. ముఖ్యంగా ఎంపీడీవోలు.. తమ తమ మండలాల స్థాయిలో ఉద్యోగులను మండల కేంద్రాలకు వచ్చి మరీ రక్త దానం చేయాలంటూ.. ఆదేశాలు జారీ చేయడం.. దీనికి సంబంధించి హాజరు కూడా నమోదు చేసుకోవడం.. వంటివి తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి.
ఇక, సీఎం జగన్ సొంత జిల్లా కడపలో అయితే.. గత రాత్రి నుంచి పెద్ద ఎత్తున టెంట్లు వేసి.. మరీ రక్త దానం సేకరిస్తున్నారు. ఇక, కళాశాల విద్యార్థుల నుంచి కూడా రక్తాన్ని తీసుకోవాలని..ఆయా కాలేజీలకు టార్గెట్లు పెట్టారు. లేకపోతే.. తనిఖీలు తప్పవని హెచ్చరించారు. మరి ఇది పైస్థాయిలో తెలిసే జరుగుతోందా? లేక.. విషయం ఏంటనేది ఎవరికీ అర్థం కావడం లేదు.
నిజానికి ఆరోగ్య వంతులైన వ్యక్తుల నుంచి రక్తాన్ని సేకరించాలని వైద్యులు చెబుతున్న విషయం తెలిసిందే. కానీ, ఇప్పుడు సీఎం జగన్‌ను మరిపించి.. మురిపించి.. ఆయన దీవెనలు పొందాలనే ఉబలాటం కొద్దీ అందరి నుంచి రక్తం సేకరిస్తుండడం.. విపరీత పరిణామాలకు దారితీసే అవకాశం లేకపోలేదని అంటున్నారు పరిశీలకులు. అంతేకాదు.. అసలు ఇలా బలవంతపు రక్త సేకరణ అనేది దేశంలో ఎక్కడా లేదని ప్రస్తుతం తీసుకుంటున్న రక్తం ఏఖాతాలో జమ వేస్తారని ప్రశ్నిస్తున్నారు.
This post was last modified on December 21, 2022 6:26 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…