దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన లిక్కర్ కుంభకోణంపై లోతుగా విచారణ జరిపిన సీబీఐ.. తాజాగా సీబీఐ ప్రత్యేక కోర్టులో ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. దీనిలో అనేక సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను కోర్టు సైతం పరిగణనలోకి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. ప్రధానంగా తనకు ఏ పాపం తెలియదని చెబుతున్న తెలంగాణ సీఎం కుమార్తె కవిత, ఏపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిల పాత్రలను సీబీఐ పూసగుచ్చినట్టు వివరించడం గమనార్హం.
ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్న కీలక విషయాలు ..
- లిక్కర్ కుంభకోణంలో ముడుపులు నగదు రూపంలో హవాలా మార్గంలో తరలించారు.
- అభిషేక్ బోయిన్‌పల్లి 20 నుంచి 30 కోట్ల రూపా యల నగదును హవాలా మార్గంలో తరలించారు.
- ఈ డబ్బంతా అడ్వాన్స్‌గా 2021 జులై, సెప్టెంబర్ మధ్య కాలంలో.. రూ.30 కోట్లను దినేష్ అరోరా ద్వారా విజయ్ నాయర్‌కు అందజేశారు.
- దక్షిణాది ప్రాంతానికి చెందిన మద్యం ఉత్పత్తిదారుల తరపున అభిషేక్ బోయిన్‌పల్లి వ్యవహారం నడిపాడు.
- శరత్ చంద్రారెడ్డి, కల్వకుంట్ల కవిత, మాగుంట శ్రీనువాసులు రెడ్డి సౌత్ గ్రూప్‌ను కంట్రోల్ చేశారు.
- మద్యం ఉత్పత్తిదారులు, హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు ఏ ఇద్దరి మధ్య ఎక్కడా గుత్తాధిపత్యం కానీ సమూహాలకు కానీ లబ్ధిచేకూర్చకూడదనే విధానాన్ని రూపకల్పన చేశారు.
- మద్యం పాలసీ రూపకూల్పన జరుగుతున్న సమయంలోనే నిందితులు కుట్రకు పాల్పడ్డారు.
- హోల్‌సేల్ వ్యాపారులు 12 శాతం లాభాలు ఆర్జించేలా, దీనిలో 6 శాతం అభిషేక్ బోయిన్‌పల్లికి తిరిగి వచ్చేలా కుట్ర చేశారు.
- హోల్‌సేల్ వ్యాపారంలో వచ్చే లాభాల్లో రామచంద్రన్ పిళ్లై నుంచి బ్యాంక్ అకౌంట్స్ ద్వారా ముత్తా గౌతమ్‌కు రూ.4,756 కోట్లు అందాయని.. అతని అకౌంట్ నుంచి అభిషేక్ బోయిన్‌పల్లికి రూ.3.85 కోట్లు ట్రాన్స్‌ఫర్ అయినట్లుగా సీబీఐ తెలిపింది.
- గౌతమ్‌కు చెందిన మీడియా సంస్థలకు కూడా కొంత డబ్బు బదిలీ అయింది.
- ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మొత్తం ఏడుగురు నిందితులు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారు. పేర్కొంది.
- కొందరు ప్రజా ప్రతినిధులు, ఇతర సంస్థలతో కలిసి ఈ అక్రమాలకు పాల్పడ్డారు.
+మౌఖిక, డాక్యుమెంటరీ ఆధారాలను కూడా సేకరించినట్టు సీబీఐ ప్రత్యేక కోర్టు అభిప్రాయపడింది.