తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్.. ఇక, నుంచి బీఆర్ఎస్‌గా అవతరించనుంది. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పనుంది. ఈ మేరకు టీఆర్ఎస్ అదినేత, సీఎం కేసీఆర్ భారత ఎన్నికల సంఘానికి పంపించిన ప్రతిపాదనకు ఎన్నికల సంఘం పచ్చ జెండా ఊంపింది. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్ గా గుర్తిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు బీఆర్ఎస్ పేరు మార్పుపై ఈసీ నుంచి కేసీఆర్‌కు అధికారికంగా లేఖ అందింది.
ఈ ఏడాది అక్టోబరు 5న విజయదశమి(దసరా) సందర్భంగా అదే రోజున కేసీఆర్ అధ్యక్షతన జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో టీఆర్ఎస్‌ను జాతీయ పార్టీ బీఆర్ఎస్‌గా మారుస్తూ తీర్మానం చేశారు. మరుసటి రోజు.. ఎంపీ నామా నాగేశ్వరరావు నేతృత్వంలో కొందరు ఎంపీల బృందం కేంద్ర ఎన్నికల సంఘానికి అఫిడవిట్ సమర్పించి.. తమ పార్టీని జాతీయ పార్టీగా గుర్తించాలని అభ్యర్థించింది.
ఈనేపథ్యంలో దాదాపు 60 రోజుల తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం తన నిర్ణయాన్ని తాజాగా ప్రకటించింది . ఇదిలావుంటే, కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు నిర్వహించేందుకు పార్టీ అదినేత కేసీఆర్ పిలుపునిచ్చారు.అ దేసమయంలో శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగానే బీఆర్ఎస్ జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఆ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో పాల్గొనాలని పార్టీ నేతలను ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. బీఆర్ఎస్గా పేరుమార్పు ప్రక్రియ పూర్తికావడంపై తదుపరి కార్యాచరణపై కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు.
This post was last modified on December 9, 2022 8:31 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…