రాహుల్ కి ఇంత స్టార్ ఫాలోఇంగ్ ..

దేశం మొత్తం పాదయాత్ర చేస్తానని చెప్పటమే కాదు.. అందుకు తగ్గట్లుగా భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్రను నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీ. ఆయన చేపట్టిన జోడో యాత్రను చూస్తే.. వివిధ వర్గాల నుంచి ఆయనకు పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. మరి.. ముఖ్యంగా సినీతారలు పలువురు.. బాలీవుడ్ కు చెందిన ప్రముఖులు ఆయన పాదయాత్రకు హాజరుకావటమే కాదు.. ఆయనతో పాటు కాస్తంత నడిచి తమకున్న అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు.

తాజాగా ఆ జాబితాలో చేరారు బాలీవుడ్ నటి స్వరా భాస్కర్. తన మాటలతో.. చేతలతో తరచూ వార్తల్లో నిలిచే ఆవిడ.. రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రలో కాస్తంత సందడి చేశారు. ప్రస్తుతం రాహుల్ పాదయాత్ర మధ్యప్రదేశ్ లో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పాదయాత్రలో పాల్గొన్న స్వరా భాస్కర్.. రాహుల్ తో నడుస్తూ మాట్లాడారు. ఆయన పాదయాత్రకు తన మద్దతును తెలిపారు.

ఇప్పటివరకు జరిగిన పాదయాత్రలో సినిమా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరుకావటం.. రాహుల్ తో భేటీ కావటం గమనార్హం. ఆ జాబితాలో..

  • పూజా భట్
  • పూనమ్ కౌర్
  • రియా సేన్
  • సుశాంత్ సింగ్
  • మోనా అంబేగాష్కర్
  • రష్మీ దేశాయ్
  • ఆకాంక్ష పూరీ
  • అమో పాలేకర్
  • సంధ్యా గోఖలే
  • ఏక్తా కపూర్ తదితరులు పాల్గొన్నారు

ఇలా పలువురు సినీ ప్రముఖులు రాహుల్ చేపట్టిన పాదయాత్రలో పాల్గొని తమ మద్దతును తెలియజేస్తున్నారు. వీరే కాదు.. హాలీవుడ్ కు చెందిన సినీ నటులు కూడా ఆయన యాత్రకు తమ మద్దతును తెలపటం విశేషం. రాహుల్ ఇమేజ్ ఎంతన్న విషయాన్ని ఆయన పాదయాత్ర స్పష్టం చేస్తోంది. నిజానికి రాహుల్ యాత్ర విషయంలో మిగిలిన వర్గాలతో పోలిస్తే.. సినిమా రంగం నుంచి వస్తున్న స్పందన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.