Political News

జ‌గ‌న్‌ BirthDay వేడుకలు.. ఇక వీరిని ఆపలేం

మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి ఇన్నాళ్ల‌కు సీఎం జ‌గ‌న్ గొప్ప అవ‌కాశం ఇచ్చార‌ని అంటున్నారు నాని అనుచ‌రులు. అదేంటంటే.. వ‌చ్చే నెల 21న సీఎం జ‌గ‌న్ పుట్టిన రోజు ఉంది. ఆ రోజుతో జ‌గ‌న్‌కు 50 ఏళ్లు పూర్త‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే జ‌గ‌న‌న్న స్వ‌ర్ణోత్సవ సంబ‌రాలు పేరిట పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పండ‌గ వాతావ‌ర‌ణంలో ప్ర‌భుత్వ‌మే కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తోంది.

ఇక‌, పుట్టిన రోజు నాడు, గుడివాడ కేంద్రంగా మ‌రింత‌గా ఈ సంబ‌రాల‌ను ఆకాశాన్నంటేలా చేయాల‌ని నిర్ణ‌యించారు. దీనికి సంబంధించి మాజీ మంత్రి కొడాలి నానికి జ‌గ‌న్ ఛాన్స్ ఇచ్చార‌ని అంటున్నారు. వాస్త‌వానికి ఈ కార్య‌క్ర‌మానికి సీమ నుంచి ఇద్ద‌రు నాయ‌కులు పోటీ ప‌డినా.. సీఎం జ‌గ‌న్ నానికి ప్రిఫ‌రెన్స్ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. దీంతో త‌న నియోజ‌క‌వ‌ర్గంలో సీఎం జ‌గన్‌కు సంబంధించిన కార్య‌క్ర‌మం, పైగా పుట్టిన రోజును ఘ‌నంగా నిర్వ‌హించేందుకు కొడాలి ఏర్పాట్లు చేస్తున్నారు.

అయితే, ఆదిలోనే హంస‌పాదు మాదిరిగా కొడాలి తీసుకున్న నిర్ణ‌యం ఇప్పుడు వివాదానికి కార‌ణ‌మైంది. ఎందుకంటే.. సుమారు 14 ఎక‌రాల్లో భారీ బ‌హిరంగ స‌భ‌కు ఏర్పాటు చేయాల‌ని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆయా పొలాల్లో రైతుల‌కు కొడాలి వార్నింగ్ ఇచ్చి మ‌రీ.. పంట‌లు వేయొద్ద‌ని హెచ్చ‌రించిన‌ట్టు టీడీపీ నేత‌లు చెబుతున్నారు. సీఎం స‌భ ఉంది కాబ‌ట్టి.. అక్క‌డ ఏమీ చేయొద్ద‌ని ఆయ‌న ఆదేశించిన‌ట్టు పేర్కొంటున్నారు.

దీంతో ఈ విష‌యం వివాదంగా మారింది. రైతుల ప‌క్షాన స్థానిక టీడీపీ నాయ‌కుడు రావి వెంక‌టేశ్వ‌రావు.. హైకోర్టుకు వెళ్లాల‌ని కూడా నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది. సో ఈ ప‌రిణామాల‌తో కొడాలి నానికి ద‌క్కిన ఈ ల‌క్కీ ఛాన్స్‌.. మిస్ అవుతుందా? అనే చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ఈ కార్య‌క్ర‌మం క‌నుక స‌జావుగా సాగిపోతే.. కొడాలి ఇలాకాలో జ‌గ‌న్ తొలి కార్య‌క్ర‌మంగా రికార్డు సృష్టిస్తుంద‌ని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో.. ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on November 28, 2022 7:19 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కరోనా వేళ ప్రభాస్‌తో డైరెక్టర్ శంకర్ చర్చలు!

తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…

43 minutes ago

పార్ట్ 2 మంత్రం పని చేయలేనట్టేనా…?

విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…

2 hours ago

వైల్డ్ ఫైర్ ఎఫెక్ట్ : ఆంధ్ర వైపు సంక్రాంతి సినిమాల చూపు!

పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…

3 hours ago

ఉదయం 4 గంటలకు డాకు మహారాజ్ షోలు : సాధ్యమేనా?

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…

3 hours ago

పుష్ప కాదు జై భీమ్ హీరో అంటోన్న సీతక్క!

తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…

4 hours ago

చిరంజీవి ఫ్యాన్స్ తిట్టుకున్నా సరే..

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…

5 hours ago