వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజసాయిరెడ్డి కొండచిలువలు, పాములు, సాలీళ్లు, పక్షులు, ఇతర జంతువులతో గడిపారు. ఆ ఫొటోలను ట్విట ర్లో పోస్ట్ చేశారు. అవి శంషాబాద్ ఫామ్‌లోని దృశ్యాలని తెలిపారు. దీంతో.. సాయిరెడ్డికి శంషాబాద్ ఫామా హౌస్ ఉందా… అనే చర్చ మొద లైంది. ఆ తర్వాత… ఆ పాములు, పక్షులను గతంలో ఎక్కడో చూశామే అనే సందేహమూ కలిగింది. చివరికి.. కేసినో వివాదంలో విచారణ ఎదుర్కొం టున్న చీకోటి ప్రవీణ్ కూడా అదే ఫామ్ హౌస్లో అవే పాములు, పక్షులతో దిగిన ఫొటోలు ట్విటర్ లోనే బయటపడ్డాయి.
వెరసి… విజయసాయిరెడ్డి చీకోటి ఫామ్ హౌసు వెళ్లారని నిర్ధారణ అయ్యింది. అయితే.. ఆ ఫామ్ హౌస్ ఎవరిదో సాయిరెడ్డి చెప్పలేదు. ‘శంషాబాద్ ఫామ్ హౌస్” అని చెప్పి వదిలేశారు. అద్భుతమైన వివిధ జంతు జాలాలతో గడుపుతూ వినోదాన్ని పొం దానని, శంషాబాద్ వ్యవసాయ క్షేత్రంలోని ఈ సన్నివేశాలను మీతో పంచుకుంటున్నానని
సాయిరెడ్డి పేర్కొన్నారు. అయితే, విజయసాయిరెడ్డి ఈ ప్రాంతాన్ని శంషాబాద్ అని చెబుతున్నా. ఇది కందుకూరు- మాడ్గుల సరిహద్దులోని చీకోటి ప్రవీణ్ కుమార్ వ్యవసాయ క్షేత్రంగా కనిపిస్తోందని నెటిజన్లు పేర్కొన్నారు.
క్యాసినో వ్యవహారంలో మానీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఇప్పటికే చీకోటి ఈడీ విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఆకస్మాత్తుగా విజయసాయిరెడ్డి చీకోటి ఫామ్‌కు ఎందుకు వెళ్లారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సాయిరెడ్డి ప్రాంతం పేరు మార్చి ట్విట్ చేయడం పై ట్వీట్టర్లో నెటిజెన్లు సెటైర్లు వేసు న్నారు. అసలు చీకోటి ఫామ్ హౌసు వెళ్లారా? లేదా? అని ప్రశ్నిస్తున్నారు. అవినీతి అనకొండ
తో జాగ్రత్త అని జోకులు పేల్చారు.
కొందరు ‘తోడు దొంగలు దొరికార`ని కామెంట్లు పెట్టారు. అక్కడ గొర్రెలు లేవా? అని మరికొందరు సెటైర్స్ వేశారు. పాములతో జాగ్రత్త రెడ్డి గారూ... మీకేమైనా అయితే జగన్ రెడ్డికి మళ్లీ సింపతీ పెరిగి 175కి 175 వస్తాయోమో
నని కొందరు వ్యాఖ్యానించారు. మొత్తంగా సాయిరెడ్డి పాములతో కేరింతలపై నెటిజన్లు హాట్‌గా స్పందించడం గమనార్హం.