ఏపీ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన గుమ్మనూరు జయరాం.. టీడీపీ అధినేత చంద్రబాబు పై తీవ్ర విమ ర్శలు చేశారు. గత మూడు రోజుల పాటు చంద్రబాబు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల, పత్తికొండ, ఎమ్మిగనూరు వంటి నియోజకవర్గాల్లో పర్యటించిన విషయంతెలిసిందే. ఈ సందర్భంగా ఆయన వైసీపీ విధానాలపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఇదే తనకు చివరి ఎన్నిక అని కూడా అన్నారు.
అయితే, చంద్రబాబు నగరంలో ఉన్నప్పుడు మౌనంగా ఉన్న వైసీపీ నాయకుడు, మంత్రి గుమ్మనూరు జయరాం తాజాగా మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరు నెలల్లో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తామని మంత్రి హెచ్చరించారు. గూండాయిజం అంటే ఏంటో తెలుగుదేశం పార్టీ నేతలకు రుచిచూపి స్తామని అన్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పోటీచెయ్యలేరన్న ఆయన.. బ్యాలెట్ పేపర్‌లో పేరే ఉండదని వ్యాఖ్యానించారు.
కర్నూలు జిల్లా పర్యటనలో తనపై చంద్రబాబు చేసిన ఆరోపణలు నిజం అని నిరూపిస్తే సగం మీసం తీయించుకుంటానని.. లేకపోతే బాబు సగం గడ్డం తీయించుకోవాలని మంత్రి గుమ్మనూరు జయరాం సవాల్ విసిరారు. 2024 ఎన్నికల అనంతరం చంద్రబాబు వైసీపీలో చేరితే ఎమ్మెల్సీ ఇస్తామని.. లోకేశ్కు కో- ఆప్షన్ పదవి ఇస్తామని ఎద్దేవా చేశారు. ఆరు నెలల్లో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తామని.. గుండాయిజం అంటే ఏమిటో చూపిస్తామని వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates