పంచెకట్టులో మోడీ

మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎలాంటి ఈవెంట్స్ కు వెళ్లినా కూడా మొదట తన డ్రెస్సింగ్ స్టైల్ తోనే ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇక ఆయన ఇటీవల పంచెకట్టులో కనిపించిన విధానం అందరిని ఎంతగానో ఆకర్షించింది. గతంలో ఎప్పుడు లేని విధంగా మోడీ పంచె కట్టులో కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారని నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్శిటీ (బీహెచ్‌యూ)లో కాశీ తమిళ సంగమంను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఈ లుక్ లో కనిపించారు. దేశంలోనే పురాతనమైన రెండు స్థానాలైన తమిళనాడు, కాశీ మధ్య సంబంధాలను బలపరిస్తూ సెలబ్రేట్ చేసుకునే విధంగా ఈ కార్యక్రమాలు మొదలు పెట్టారు. ఇక మోడీ తన ప్రత్యేక విమానం నుంచి దిగుతూనే పంచె కట్టులో ఎంట్రీ ఇవ్వడం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.