‘ఇదేం ఖ‌ర్మ‌’ టీడీపీ..

ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ పోరాటాలు కొనసాగుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో మరో కొత్త కార్యక్రమానికి టీడీపీ శ్రీకారం చుట్టింది. ‘ఇదేం ఖర్మ’ పేరుతో మరో సరికొత్త కార్యక్రమాన్ని మొదలు పెట్టిం ది. తాజాగా మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో టీడీపీ అధినేత చంద్ర‌బా బు.. పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇదేం ఖ‌ర్మ కార్య‌క్ర‌మాన్ని ఆయ‌న ప్రారంభించారు. అనంత‌రం చంద్రబాబు మాట్లాడుతూ… మూడున్నరేళ్లలో ఏపీలో ఎంతో విధ్వంసం జరిగిందని అన్నారు.

ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఎన్నో దారుణాలు జరిగాయన్నారు. దారుణాలు ఏ టెర్రరిస్టులో చేయలేదని.. పోలీసుల సహకారంతో ప్రభుత్వమే విధ్వంసం సృష్టించిందని మండిపడ్డారు. టీడీపీ ఎప్పుడూ జాతీయ భావాలతోనే వెళ్లిందని తెలిపారు. టీడీపీ జాతీయ ప్రత్యామ్నాయాల్లో కూడా కీలక పాత్ర పోషించిందని చెప్పుకొచ్చారు. పలు సంస్కరణలతో టీడీపీ ముందుందని… దేశానికే దిక్సూచిగా ఉండేలా కార్యక్రమాలు నిర్వహించామన్నారు.

ప్రతిపక్షంలో కూడా అంతే బాధ్యతగా ఉన్నామన్నారు. ‘‘చాలా మంది సీఎంలను చూశాను.. ఎన్నో ప్రభు త్వాలను చూశాను. ఇంతటి దారుణమైన.. నీచమైన ప్రభుత్వాన్ని చూడలేదు’’ అంటూ చంద్రబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్ర‌భుత్వంపై పోరాడేందుకు ప్ర‌తి కార్య‌క‌ర్త సిద్ధంగా ఉండాల‌ని బాబు పిలుపు నిచ్చారు. ఇదేం ఖ‌ర్మ కార్య‌క్ర‌మంలో ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని ఆయ‌న సూచించారు. ప్ర‌తినియోజ‌క‌వ‌ర్గంలోనూ ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించాల‌ని చంద్ర‌బాబు సూచించారు.