ఏపీ వైసీపీ నాయకుడు, పొలిటికల్ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని.. తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కిడ్నీలో రాళ్లు చేరడంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. దాదాపు వారం రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. మూడు రోజుల క్రితమే ఆయన ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది.
శుక్రవారం రాత్రి కొడాలి నానికి వైద్యులు కిడ్నీ సంబంధిత శస్త్ర చికిత్సను నిర్వహించారు. ప్రస్తుతం అపోలో ఆసుపత్రి ఐసీయూలో కొడాలి నాని ఉన్నారు. రెండు, మూడు రోజుల్లో ఆయన డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. రెండు వారాలపాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచించారు. అనంతరం అంతా బాగుందనుకుంటే 15 రోజుల తర్వాత కిడ్నీ సంబంధిత లేజర్ చికిత్సను వైద్యులు చేయనున్నారు.
ఇదిలావుంటే, కొన్నాళ్ల కిందట కూడా.. అనూహ్యంగా నాని అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలోనూ హైదరాబాద్లోనే చికిత్స తీసుకున్నారు. అయితే, అప్పట్లో కారణాలు వెలుగు చూడలేదు. కొన్నాళ్ల చికిత్స అనంతరం తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. ప్రస్తుతం కొడాలి నాని ఆరోగ్యం నిలకడగానే ఉందని, కిడ్నీ ఆపరేషన్ విజయవంతం అయిందని వైద్యులు చెప్పడం గమనార్హం. ఇక, నియోజకవర్గంలో కొడాలి నాని అభిమానులు.. ఆయన త్వరగా కోలుకోవాలని.. పూజలు చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates