ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై టీడీపీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీరియస్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో పవర్ హాలిడే, క్రాప్ హాలిడే, ఇప్పుడు ఆక్వా హాలిడే అమలు చేస్తున్నారని అన్నారు. ఇదే పద్ధతి కొనసాగితే.. త్వరలోనే జగన్‌కు పొలిటికల్ హాలీడే ప్రకటించడం తథ్యమని వ్యాఖ్యానించారు. ప్రజలు కూడా దీనికోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఇక జగన్ రెడ్డి హాలిడే తీసుకోవడం మాత్రమే మిగిలి ఉందని ట్విటర్ వేదికగా ఎద్దేవా చేశారు.
ఆక్వా రంగాన్ని ఉద్ధరిస్తానని నమ్మించి దగా జగన్ దగా చేశాడన్నారు. ‘‘వైసీపీ ప్రభుత్వ అసమర్ధతతో ఆక్వారంగం సంక్షోభంలో పడింది. పెరిగిన విద్యుత్ ఛార్జీలు, దాణా ఖర్చులు, నిర్వహణ ఖర్చులతో ఆక్వా రైతులు కుదేలయ్యారు. వంద కౌంట్ కిలో రొయ్య ఉత్పత్తికి రూ.270 ఖర్చవుతుంటే కనీసం రూ.200 కూడా రాక రైతులు ఆక్వా హాలిడే ప్రకటిస్తున్నారు. కొత్త చట్టాల పేరుతో ఆక్వా రైతులను, ప్రాసెసింగ్ ప్లాంట్స్ నిర్వహిస్తున్న వారిని వేధిస్తూ వైసీపీ నేతలు కోట్లు దండుకుంటున్నారు“ అని లోకేష్ విమర్శలు గుప్పించారు.
ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి ఆక్వా రైతులను ఆదుకోవాలన్నారు. జోన్‌తో సంబంధం లేకుండా ఆక్వా రైతులందరికి యూనిట్ విద్యుత్‌ని రూ. 1.50 కే అందించాలి. దాణా, ఇతర సామాగ్రిని రాయితీకి ఇవ్వాలి. మద్దతు ధర ప్రకటించాలని లోకేష్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే రాజకీయాలు అధ్వాన్నంగా తయారు చేసిన ఘనత వైసీపీకే దక్కుతుందని పేర్కొన్నారు. ప్రతి విషయాన్నీ తమ స్వలాభం కోసం చూసుకుంటున్న వైసీపీ నాయకులకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates