షాకింగ్ ఉదంతం ఒకటి బయటకు వచ్చింది. జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందా? ఆయన ప్రాణాలు ఇప్పుడు డేంజర్ లో ఉన్నాయా? ఆయన పై దాడి చేసేందుకు ప్లానింగ్ జరుగుతోందా? ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ ఇంటి వద్ద అనుమానాస్పద వాహనాలు తిరగటమే కాదు.. కొందరు వ్యక్తులు ఇంటి ముందుకు వచ్చి సందేహం కలిగేలా సంచరిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి తోడు.. వాహనాలతో వచ్చిన వారు కొందరు.. బూతులు మాట్లాడుతూ అక్కడి వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినట్లుగా ఆరోపణలు చేస్తున్నారు.
ఇంతకీ అసలేం జరిగిందంటే.. విశాఖ ఎపిసోడ్ జరిగిన తర్వాత నుంచి పవన్ ఇంటి వద్ద.. పార్టీ కార్యాలయం వద్ద కొందరు పవన్ కల్యాణ్ ప్రయాణిస్తున్న కారును అదే పనిగా ఫాలో అవుతున్నారు. ఇంటి నుంచి పవన్ కల్యాణ్ బయటకు వెళ్లిన ప్రతి సందర్భంలోనూ.. అదే విధంగా తిరిగి ఇంటి వచ్చే సమయంలో పవన్ కల్యాణ్ కారును ఫాలో అవుతున్నట్లుగా జనసేన పేర్కొంది. దీనికి సంబంధించిన కంప్లైంట్ ను తాజాగా జూబ్లీహిల్స్ స్టేషన్ లోఫిర్యాదు చేశారు.
ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న అంశాలతో పాటు..ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాల్ని కంప్లైంట్ కాపీలో పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ ఇంటి నుంచి బయటకు వచ్చి.. మరోచోటుకు వెళ్లినా.. ఆయన్ను అనుసరిస్తున్న కారు మాత్రం పవన్ కారును ఫాలో అవుతున్నట్లుగా చెబుతున్నారు.
అంతేకాదు.. పవన్ ఇంటి ఎదుటకు వచ్చిన కొందరు పెద్ద ఎత్తున బూతులు తిడుతూ.. దుర్బాషలాడుతూ ఉన్నారంటే.. వారెవరు? ఎవరు పంపితే వచ్చారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు సేకరించాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది. తమ సిబ్బందిని రెచ్చగొట్టటమే లక్ష్యంగా అక్కడకు వచ్చిన వారి తీరు ఉందన్న మాట వినిపిస్తోంది. పవన్ వాహనాల్ని అదే పనిగాఫాలో అవుతున్న కార్ల నెంబర్లను సేకరించిన జనసేన విభాగం వారు.. తాజాగా పోలీసులకు సమాచారాన్ని పంపారు. విషయాన్ని వీలైనంత చిన్నదిగా చేయటం సరికాదన్న మాట వినిపిస్తోంది.
మరి.. పోలీసులు ఈ వ్యవహారంపై తమ విచారణ క్రమాన్ని.. ఏయే అంశాలు బయటకు వచ్చాయో పోలీసులు వెల్లడించాల్సి వచ్చింది. మరేం జరుగుతుందన్నది వెయిట్ చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates