హాట్ టాపిక్‌గా విజ‌య‌వాడ ఎంపీ టిక్కెట్‌…!

విజ‌య‌వాడ ఎంపీ టికెట్ అంటే ప్ర‌స్తుతం ఒక హాట్ సీట్ లెక్క‌. రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లు ఉన్నా విజ‌య‌వాడ లెక్క‌వేరే అంటున్నారు వైసీపీ నాయ‌కు లు. దీనిని ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రికీ కేటాయించ‌లేదు. గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త పొట్లూరి వ‌ర‌ప్ర‌సాద్ పోటీ చేసినా ఓడిపోయారు. త‌ర్వాత ఆయ‌న ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. కొన్నాళ్లు ప్ర‌భుత్వ‌కార్య‌క్ర‌మాల్లో హ‌ల్చ‌ల్ చేసినా త‌ర్వాత ఆయ‌న వ్యాపారాలు, వ్య‌వ‌హారా్ల్లోనే ఉంటున్నారు. దీంతో ఈ సీటును ఆయ‌న‌కే కేటాయిస్తారా? లేక ఎవ‌రికైనా ఇస్తారా? అనే చ‌ర్చ‌జ‌రుగుతోంది. అయితే, దీనిపై వైసీపీ అధిష్టానం మౌనంగా ఉంది.

దీనికి కార‌ణం ఏంట‌నేది ఇంకా తెలియ‌క పోయినా ఒక విష‌యం చ‌ర్చ‌కు వ‌స్తోంది. రాజ‌కీయంగా ఉన్న వ్యూహాల నేప‌థ్యంలో ఈ టికెట్‌ను వ‌దులుకు నేందుకు వైసీపీ సిద్ధ‌ప‌డుతోంద‌నే చ‌ర్చ సాగుతోంది. ఇది కొంత ఆశ్చ‌ర్యంగానే ఉన్నా నిజ‌మ‌న్న‌ట్టుగా వైసీపీలోనే ప్ర‌చారం సాగుతోంది. వ‌చ్చే ఎన్నిక ల నాటికి ఈ టికెట్‌నుంచి బీజేపీ పోటీ చేస్తుంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ఉన్న ఎంపీ కేశినేని నానికి క‌నుక టీడీపీలో టికెట్ ద‌క్క‌క‌పోతే ఆయ‌న వెంట‌నే బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీగా ఉన్నారని కొన్నాళ్లుగా విజ‌య‌వాడ‌లో చ‌ర్చ‌సాగుతోంది.

అయితే, దీనిపై ఇంకా క్లారిటీ లేక‌పోయినా, రాజ‌కీయంగా ఆయ‌న త‌మ్ముడు పుంజుకోవ‌డం, టీడీపీ నేత‌లు ఆయ‌న‌కు జైజేలు కొట్ట‌డం వంటివి ఇక్క‌డ హాట్ పుట్టిస్తున్నాయి. దీంతో ఏదైనా జ‌ర‌గొచ్చు అనే చ‌ర్చ‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో రేపు బీజేపీ క‌నుక ఇక్క‌డ నుంచి పోటీ చేస్తే.. దీనిని శాక్రిఫైజ్ చేసేందుకు వైసీపీ రెడీగా ఉంద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. వ‌చ్చే ఎన్నికల నాటికి ప‌రిస్థితుల‌ను బ‌ట్టి నిర్ణ‌యం తీసుకునే ఛాన్స్ ఉంటుంద‌ని కూడా కొంద‌రు సీనియ‌ర్లే అంటున్నారు. సో.. ఎలా చూసుకున్నా రాజ‌కీయంగా విజ‌య‌వాడ ఎంపీ టికెట్ ఇప్పుడు ఆస‌క్తిగా మారింది.

మ‌రోవైపు, కేశినేని నాని వైఖ‌రితో విసిగిపోయిన టీడీపీ ఆయ‌న‌ను త‌ప్పించి మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ కుటుంబానికి ఈ సీటు ఇచ్చేందుకు చూస్తోంద‌నే ప్ర‌చారం కూడా సాగుతోంది. దీనిలో ఎంత నిజం ఉందో తెలియ‌దు కానీ, కేశినేనిని గుంటూరుకు పంపిస్తార‌ని అంటున్నారు. ఇలా ఏ విధంగా చూసుకున్నా రాజ‌కీయంగా విజ‌య‌వాడ ఎంపీ హాట్ టాపిక్ అయింది. చివ‌ర‌కు ఏం జ‌రుగుతుందో చూడాలి.