ప్రశ్నిస్తానంటూ.. పార్టీ పెట్టిన జనసేన ఎన్నికల విషయానికివస్తే.. వచ్చే ఎలక్షన్‌లో విజయం దక్కించు కోవాలని నిర్ణయించుకుంది. వైసీపీ ఓటు బ్యాంకును చీలకుండా చూసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తా నని.. సాక్షాత్తూ.. పవన్ కూడా ప్రకటించారు. అయితే.. ఇది సాకారం కావాలంటే.. వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా ఉండాలంటే.. వేరే పార్టీతో పొత్తు పెట్టుకుంటే సరిపోతుందని.. ఆయన భావన కావొ చ్చు. కానీ, ఇది సాధ్యం కాదని అంటున్నారు పరిశీలకులు.
ఎందుకంటే.. ముందు ఇంట గెలిచి.. కదా.. రచ్చ గెలవాలి.. అంటున్నారు. క్షేత్రస్థాయిలో చూసుకుంటే.. జనసేనకు ఉన్న పట్టు అంతంత మాత్రమే. ఎన్ని చెప్పినా.. పవన్ ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు చేసినా .. క్షేత్రస్థాయిలో ప్రజల మైండ్‌ను మార్చాలంటే.. ఆయనకు బూత్ లెవిల్ కార్యకర్తలు.. నాయకులు అవసరం. ఇవి లేకుండా.. ముందుకు సాగడం అంటే కర్ర విడిచి సాము చేయడమేనని అంటున్నారు మేధావు లు. ముందుగా దీనిపై నే ఆయన దృష్టి పెట్టాలని కూడా చెబుతున్నారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే.. జనసేన ఏర్పాటు జరిగి దాదాపు 9 ఏళ్లు అయింది. ఇటీవలే 8వ వార్షికో త్సవాన్ని కూడా నిర్వహించారు. కానీ, ఒక మండల స్థాయిలో పార్టీ ఎదిగిందా? పార్టీ జెండా పట్టుకున్న నాయకుడు ఉన్నారా? అంటే.. లేరనే చెప్పాలి. ఎక్కడికక్కడ.. అభిమానులు అయితే.. ఉన్నారు కానీ.. జెండా మోసే కార్యకర్తను మాత్రం పవన్ ఏర్పాటు చేసుకోలేక పోయారనేది వాస్తవం. అసలు క్షేత్ర స్థాయిలో కార్యకర్తలే లేకుండా పవన్ ఎలా సీఎం అయిపోతాడో ఎవ్వరికి తెలియని పరిస్థితి.
ఈ క్రమంలో ఇప్పటికైనా.. ఆయన బూత్ స్థాయిలో కార్యకర్తలను, నేతలను ఏర్పాటు చేసుకుని.. ముందుకు సాగితేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. కేవలం ఒకప్రెస్ మీట్.. రెండు సభలు పెట్టినంత మాత్రాన.. పార్టీ ఎదిగిపోతుందని అనుకుంటే.. అన్ని పార్టీలూ ఆ పనే చేసేవి కదా.. కానీ, అలా కాదు అంతకు మించి.. అన్నట్టుగా పార్టీ ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు పరిశీలకులు. మరి పవన్ .. ఆదిశగాఅడుగులు వేస్తారో లేదో చూడాలి.
This post was last modified on October 12, 2022 6:58 pm
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…