Movie News

కొత్త శుక్రవారం గంగార్పణం అవుతోంది

థియేటర్లకు సరైన సినిమాలు వస్తే రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళను కనీస స్థాయిలో మెప్పించే కంటెంట్ ఉన్నవి రిలీజ్ కావడం లేదు. కాస్త ఓకే టాక్ వచ్చిన మృత్యుంజయ్ లాంటివి కూడా ఫెయిల్యూర్ బాట పట్టడం ఊహించని షాక్. అంతకు ముందు వారం విడుదలైన కపుల్ ఫ్రెండ్లీకి సోషల్ మీడియా, రివ్యూల మద్దతు దొరికినా దాని ప్రభావం ఏ సెంటర్లకే పరిమితమయ్యింది. ఇప్పుడు కొత్త ఫ్రైడే వస్తోంది.

ఎలాగూ మార్చి 19 దురంధర్ ది రివెంజ్, ఉస్తాద్ భగత్ సింగ్ ఉన్నాయి కాబట్టి వారం రోజుల రన్ కోసం ఏం రిలీజ్ చేస్తాంలే అని నిర్మాతలు వెనుకడుగు వేశారు. బ్యాండ్ మేళం ఏకంగా మార్చి 26కి వెళ్ళిపోయింది. దీంతో థియేటర్లకు మళ్ళీ వెయిటింగ్ పీరియడ్ తప్పడం లేదు. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే కాంచన రీ రిలీజ్ షోలు పెరుగుతున్నాయి. చాలా చోట్ల మెయిన్ స్క్రీన్లు దీనికి ఇస్తున్నారు. దానికి తగ్గట్టే జనాలు కూడా బాగానే టికెట్లు కొంటున్నారు.

అంటే ఈ వారం గంగార్పణం అయిపోయినట్టే. షోలు క్యాన్సిల్ కావడం, జనాలు లేక థియేటర్లు మూసేయడం కొనసాగనుంది. మెయిన్ సెంటర్స్ లో ఏదోలా నెట్టుకొస్తున్నా, బిసి కేంద్రాల్లో మాత్రం పరిస్థితి దయనీయంగా ఉంది. తిరిగి పవన్ కళ్యాణ్, రణ్వీర్ సింగ్ వచ్చే దాకా ఈ సిచువేషన్ లో ఎలాంటి మార్పు ఉండే అవకాశం లేదు. నిజానికి చిన్న సినిమాలకు వన్ వీక్ రన్ అనేది మంచి ఆప్షన్. టాక్ బాగొస్తే అంత తక్కువ టైంలోనే బ్రేక్ ఈవెన్ అయిపోవచ్చు.

కానీ అలా కాదనుకుని డేట్లు వదిలేసుకోవడం వల్ల ఎవరికీ ప్రయోజనం కలగడం లేదు. కంటెంట్ బాగుంటే ఎలాగూ జనం వస్తారు. తర్వాత కాంపిటీషన్ వచ్చినా భయపడే అవసరం ఉండదు. లేదు సినిమా అంతంత మాత్రంగా ఉంటే ఇమేజ్ ఉన్న శ్రీవిష్ణుకైనా ఇబ్బందులు తప్పవని ఇటీవలే ఋజువయ్యింది. అతివృష్టి, అనావృష్టి లాగా నిర్మాతల మధ్య సఖ్యత లేకపోవడం పోటీ వాతావరణాన్ని సృష్టిస్తోంది. లేదంటే ఇలా శుక్రవారాలను వృథాగా పోనిస్తోంది.

This post was last modified on March 11, 2026 11:36 am

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

5 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

5 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

6 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

6 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

7 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

7 hours ago