కేసీయార్ ఏర్పాటు చేయబోయే కొత్త జాతీయపార్టీలోకి చేరే నేతల్లో మొదటి వికెట్ కాంగ్రెస్ నుండి పడింది. ఈమధ్యనే టీఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన నల్లాల ఓదేలు తాజాగా తిరిగి టీఆర్ఎస్ లో చేరిపోయారు. బుధవారం ఉదయం ప్రగతిభవన్లో కేసీయార్ ను కలిసి ఓదేలు తాను టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. కేసీయార్ సమక్షంలో కారు కండువా కప్పుకున్నారు. రాబోయే ఎన్నికల్లో తనకు ఎంపీగా పోటీచేసే అవకాశం ఇవ్వాలని కేసీయార్ ను కోరారు.
జాతీయపార్టీకి ఇందుకు అవసరమైన సాంకేతిక వ్యవహారాలను ఒకవైపు చేస్తునే మరోవైపు రాజకీయపరమైన వ్యవహారాల్లో స్పీడు పెంచారు. జాతీయపార్టీగా ప్రకటించే కార్యక్రమానికి దేశంలోని అనేక పార్టీలకు చెందిన ప్రముఖులను, వివిధ రంగాల్లో నిపుణులను ఆహ్వానించారు. వారిలో కొందరు ఇప్పటికే హైదరాబాద్ కు చేరుకున్నారు.
ఇందులో భాగంగానే జాతీయపార్టీలో చేరాలని స్వయంగా కేసీయార్ కొందరికి ఇప్పటికే ఫోన్లుచేసి ఆహ్వానించారు. మరికొందరికి తన సన్నిహితుల ద్వారా ఫోన్లలో మాట్లాడిస్తున్నారు. ముందుగా ఏపీలోని కాంగ్రెస్, టీడీపీ నేతలతో మాట్లాడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పై రెండుపార్టీల నేతలతో కేసీయార్ కు మంచి పరిచయాలే ఉన్నాయి. అలాగే పై రెండుపార్టీల నుండి టీఆర్ఎస్ లో చేరిన నేతల ద్వారా గాలమేస్తున్నారు.
ఇందులో భాగంగానే ఎవరు మాట్లాడారో ఏమో తెలీదు కానీ తెలంగాణాలోని మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు ఎంఎల్ఏగా పనిచేసిన నల్లాల ఓదేలు కాంగ్రెస్ పార్టీని వదిలేశారు. ఓదేలు ఈమధ్యనే ఢిల్లీకి వెళ్ళి ప్రియాంకగాంధి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా కేసీయార్ జాతీయపార్టీలో చేరటంకోసమన బుధవారం ఉదయం ప్రగతిభవన్ కు వెళ్ళి మళ్ళీ కారెక్కేశారు. సో కేసీయార్ ఏర్పాటుచేయబోయే జాతయపార్టీలో చేరిన మొదటి నేత అవుతారేమో.