జ‌గ‌న్ సార్‌.. మూడు జిల్లాల కోసం చూస్తే.. ప‌ది చేజారుతున్నాయే!!

ఔను.. రాజ‌కీయాల్లో ఏం చేసినా.. పార్టీకి మేలు జ‌ర‌గాలి. ప్ర‌జ‌ల‌కు మేలు చేయాలి. ఏ పార్టీ అయినా.. నాయకుడికైనా.. ఉన్న ఏకైక ల‌క్ష్యం ఇదే. అయితే.. ఏపీ సీఎం జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యంతో ఆయ‌న‌కే పెద్ద మైన‌స్ ఏర్ప‌డుతోంద‌ని మేధావి వ‌ర్గం చెబుతోంది. ఆయ‌న తీసుకున్న మూడు రాజ‌ధానుల నిర్ణ‌యంతో ఆయ‌న‌కు పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని.. చెబుతున్నారు. ఎందుకంటే.. ఇది మూడు ప్రాంతాల‌కు సంబంధించిన విష‌యంగా మారిపోతే.. మిగిలిన ప‌ది జిల్లాల విష‌యం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో 13 ఉమ్మ‌డి జిల్లాలు ఉన్నాయి. ఇక‌, రాజ‌ధాని అమ‌రావ‌తి.. ఒక్క గుంటూరులోనే ఉంది. గ‌త ప్ర‌భుత్వం ఇక్క‌డ న‌వ‌న‌గ‌రాలు పేరుతో అభివృద్ధి చేసేందుకు రెడీ అయింది. స‌న్ రైజ్ స్టేట్‌గా ఏపీని తీర్చ‌దిద్దాల‌ని నిర్ణ‌యించుకుంది. అయితే.. గత ఎన్నిక‌ల్లో తెలుగు దేశం పార్టీ ఓడిపోయిన ద‌రిమిలా.. వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది. వ‌చ్చీరావ‌డంతోనే.. మూడు రాజ‌ధానులు అంటూ.. సీఎం జ‌గ‌న్ ప‌ల్ల‌వి అందుకున్నారు. అంతేకాదు.. మూడు ప్రాంతాల అభివృద్ది దీనివ‌ల్లే సాధ్య‌మ‌ని కొత్త భాష్యం చెప్పారు.

ఈ దిశ‌గానే అడుగులు వేస్తున్నారు. కోర్టులు వ‌ద్దంటున్నా.. రాజ‌ధాని అమ‌రావ‌తి రైతులు.. మేం భూములు ఇచ్చాం.. మాకు అన్యాయం చేస్తారా.. అంటూ.. క‌న్నీరు పెడుతున్నా.. జ‌గ‌న్ మాత్రం త‌న పంతానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే.. దీనివ‌ల్ల జ‌గ‌న్‌కు కానీ.. వైసీపీకి కానీ.. ఒన‌గూరే ప్ర‌యోజ‌నం ఏంటి? అస‌లు 175కు 175 అసెంబ్లీలు గెలుచుకుందామ‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న జ‌గ‌న్ టార్గెట్ ఏమేర‌కు స‌క్సెస్ అవుతుంది? అనేది ఇప్పుడు కీల‌క‌మైన చ‌ర్చ‌కు వ‌స్తోంది.

దీనిపై మేధావులు ఆస‌క్తిక‌ర చ‌ర్చ చేస్తున్నారు. రాష్ట్రంలో గ‌త ఎన్నిక‌ల్లో నెల్లూరు, కర్నూలు, క‌డ‌ప‌, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో.. వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అదేవిధంగాఇత‌ర జిల్లాల్లోనూ… భారీ ఎత్తున సీట్లు పోగేసుకుంది. ఈ ప‌రిణామం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కొన‌సాగాలంటే.. ఎక్క‌డి రాజ‌ధానిని అక్క‌డే ఉంచాల‌నేది మేధావుల మాట‌. అలా కాకుండా.. మూడు రాజ‌ధానులు చేస్తే.. కేవ‌లం.. జ‌గ‌న్‌కు ఆ మూడు ప్రాంతాల్లోని ప్ర‌జ‌లే.. ఓట్లు వేసే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు.

మిగిలిన జిల్లాల్లో ప్ర‌జ‌లు ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా చ‌క్రం తిప్పినా.. ఆశ్చ‌ర్యం లేద‌నేది.. మేదావుల మాట‌. ఎందుకంటే.. విశాఖ‌ను రాజ‌ధాని చేస్తే.. క‌ర్నూలు, క‌డ‌ప‌, అనంత‌పురం, చిత్తూరు ప్ర‌జ‌ల‌కు వంద‌ల కిలో మీట‌ర్ల‌దూరం పెరిగిపోయి.. ఉపాధి కూడా దెబ్బ‌తినే ప్ర‌మాదం ఉంది. ఇక‌, ఉభ‌య గోదావ‌రి జిల్లాలు, కృష్ణా, గుంటూరు వాసులు.. కీల‌క మైన పాల‌నా రాజ‌ధాని.. గుంటూరులోనే ఉండాలని కోరుకుంటున్నారు., ఈ నేప‌థ్యంలో ఆయా జిల్లాల్లో వైసీపీకి వ్య‌తిరేక ప‌వ‌నాలు వీచే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌ని మేధావులు చెబుతున్నారు.

అంటే.. మూడు రాజ‌ధానుల‌తో జ‌గ‌న్ ద‌క్కేది.. కేవ‌లం మూడు జిల్లాల్లో విజ‌య‌మే త‌ప్ప‌.. మిగిలిన 10 ఉమ్మ‌డి జిల్లాల్లో మాత్రం వ్య‌తిరేక‌త ఖాయ‌మ‌ని అంటున్నారు. మ‌రి జ‌గ‌న్ ఏం ఆలోచిస్తున్నారో.. ఏమో తెలియ‌దు కానీ.. పార్టీ న‌మ్ముకున్న నాయ‌కుల‌ను మాత్రం ఈ ప‌రిణామం.. తీవ్ర ఎఫెక్ట్ చూపిస్తుంద‌నే ఆవేద‌న‌, ఆందోళ‌న‌, అంత‌కు మించిన భ‌యం వెంటాడుతుండ‌డం గ‌మ‌నార్హం.మ‌రి ఇప్ప‌టికైనా..జ‌గ‌న్‌, పార్టీని దృష్టిలో పెట్టుకుని ఏం చేస్తారో చూడాలి.