‘తమలపాకుతో నువ్వొకటంటే.. తలుపు చెక్కతో నే రెండంటా!’ అన్న సామెతను నిజం చేస్తున్నారు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ నాయకులు. ప్రస్తుతం కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీ.. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుపై ఉద్యమం చేస్తున్నారు. దీనిలో భాగంగా.. ఆయన భారత్ జోడో(భారత సమైక్యత) యాత్రను ప్రారంభించారు. 3500 కిలో మీటర్ల మేర ఆసేతు హిమాచలం పాదయాత్ర చేసి.. మోడీ ప్రభుత్వ తీరును ఎండగట్టాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా పెట్రోలు ధరలు.. గ్యాస్ ధరలు.. బియ్యం, పప్పుదినుసుల ధరల పెంపును ఆయన వ్యతిరేకిస్తున్నారు.
మోడీ పాలనలో ప్రజలు బ్రతకలేకపోతున్నారని.. రాహుల్ విమర్శలు చేస్తున్నారు. గత యూపీఏ పాలనలో 400 ఉన్న గ్యాస్ సిలెండర్ ధర.. ఇప్పుడు 1100లకు చేరిందని.. పెట్రోల్ అప్పట్లో 60గా ఉంటే.. ఇప్పుడు సెంచరీ కొట్టిందని.. బియ్యం అప్పట్లో 25 ఉండే.. ఇప్పుడు 50 దాటిందని.. ఇలా లెక్కలు వక్కాణిస్తూ.. ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. ఈ సమయంలోనే బీజేపీ నేతలు.. రాహుల్ను కార్నర్ చేశారు. “రాహుల్ పెరిగిన ధరలపై యుద్ధం చేస్తున్నారు.. కానీ.. ఆయన 41 వేల ఖరీదైన టీషర్టు వేసుకుని. నవ్విపోతారన్న ధ్యాస కూడా లేకుండా!” అని బీజేపీ నేతలు నిప్పులు చెరిగారు.
దీంతో కాంగ్రెస్ నాయకులు కూడా అంతే దీటుగా స్పందించారు. ప్రధాని మోడీ.. వేసుకునే సూటు, లాల్చీ.. ధరలను రోడ్డెక్కించా రు. 10 లక్షల విలువ చేసే.. సూటును మోడీ ధరిస్తున్నారని.. చెప్పారు. అంతేకాదు.. మోడీ వేసుకునే బూట్లు ఏకంగా రెండు లక్షల రూపాయలని చెప్పుకొచ్చారు. దీంతో కాంగ్రెస్ వర్సెస్‌బీజేపీల మధ్య పెరుగుతుందని అనుకున్న వాగ్బాణాలు మటు మాయమయ్యాయి. అయితే.. ఈ విషయంపైనెటిజన్లు ఆసక్తిగా స్పందిస్తున్నారు. గాంధీ వారసులమని చెప్పుకొనే.. కాంగ్రెస్ నేతలు.. ఖరీదైన బట్టలు వేసుకుని ఉద్యమాలు చేయడం ఏమిటో? అని పెదవి విరుస్తున్నారు.
ఇక, బీజేపీని కూడా ఆటపట్టిస్తున్నారు. “చాయ్‌వాలాకు పది లక్షల సూటు ఎక్కడి నుంచి వచ్చిందో!” అనే కామెంట్లు చేస్తున్నారు. ఈ రెండు పార్టీలు పేదలకు చేసింది ఏమిటనేది.. విశ్లేషకులు ప్రశ్న. ఎవరు అధికారంలో ఉన్నా.. ప్రజలను పీల్చి పిప్పి చేసే నిర్ణయాలే తీసుకున్నారని.. సగటు పౌరుడు నిప్పులు చెరుగుతున్నాడు. మీరు ప్రజలకు సేవ చేయాలని అనుకుంటే.. ముందు సాధారణ వ్యక్తులుగా మారాలంటూ.. నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన నాయకుల నుంచి ప్రజలను దోచుకునే నాయకులు దేశం పెరుగుతున్నారని.. మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమనా.. వేలు వర్సెస్ లక్షలు అంటూ.. కాంగ్రెస్, బీజేపీలు చేసుకున్న కామెంట్లు.. ఆ పార్టీలపై సటైర్లు కురిపించేలా చేస్తుండడం గమనార్హం.
This post was last modified on September 10, 2022 10:16 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…