ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం నరసరావు పేట. ఒకప్పుడు బలమైన టీడీపీ నాయకులు ఇక్కడ ఉండేవారు. ఇప్పుడు కూడా ఉన్నారు. అయితే.. వరుస విజయాలతో వైసీపీ దూకుడు చూపిస్తోంది. డాక్టర్.. గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఇక్కడ నుంచి విజయం దక్కించుకున్నారు. ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరనలో ఆయన కు బెర్త్ లభిస్తుందని అనుకు న్నారు. కానీ, ఆయనకు రెడ్డి ట్యాగ్ కారణంగా.. లభించలేదని.. ఆయన వర్గం అప్పట్లోనే బాహాటంగా చెప్పింది. ఇక, ప్రజా వైద్యుడిగా ఆయనకు పేరుంది. దీంతో ప్రజల్లో ఆయనకు సానుభూతి కనిపిస్తోంది.
కానీ, వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పరిణామాలు మారుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున బలమైన నాయకుడిని రంగంలోకి దింపుతారని చెబుతున్నారు. కోడెల శివరామకృష్ణను రంగంలోకి దింపాలని.. ఇక్కడి నాయకులు కోరుతున్నారు. అయితే..దీనిపై చంద్రబాబు కానీ.. పార్టీ సీనియర్లు కానీ.. పెదవి విప్పడం లేదు. మరోవైపు.. రాయపాటి కుమారుడు.. రంగారావు.. ఇక్కడ కర్చీఫ్ వేసి ఉన్నట్టు.. కూడా ప్రచారం ఉంది. ఈ క్రమంలో ఇక్కడ టీడీపీ తరఫున ఎవరు బరిలోకి దిగుతారు? అనేది ఆసక్తిగా మారింది.
ఎవరు పోటీ చేసినా.. గెలుపు మాత్రం తమదేనని వైసీపీ బల్లగుద్ది చెప్పలేని పరిస్థితి ఇప్పుడు ఉండడం గమనార్హం. ప్రధానంగా రాజధాని ఎఫెక్ట్.. డాక్టర్ ఎమ్మెల్యేను కలవరపెడుతోంది. అమరావతిని కోరుకుంటున్న వారు ఇక్కడ ఎక్కువగా ఉండడం. పైగా.. రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలు రెండూ కూడా.. అమరావతి కావాలని చెబుతుండడంతో ఎమ్మెల్యేకు ఇబ్బందికర పరిస్తితి ఏర్పడింది. ఇంకో వైపు.. టీడీపీ రాజధానిగా అమరావతినే ఉండాలని కోరుకుంటోంది. రాయపాటి కుటుంబం కూడా యాక్టివ్‌గా రైతు ఉద్యమంలో పార్టిసిపేట్ చేసింది.
ఈ పరిణామాలతో టీడీపీకి అనుకూలంగా ఇక్కడ పరిస్థితి ఉందనే సంకేతాలు వస్తున్నాయి. అయితే.. టీడీపీ ఎవరికి టికెట్ ఇస్తుంది.. ఎవరు ఇక్కడ నుంచి పోటీ చేస్తారు? అనేది మాత్రం ఆసక్తిగా మారింది. ఏదేమైనా.. ఈకీలకమైన నియోజకవర్గంలో పోటీ .. మాత్రం భీకరంగా ఉంటుందని.. వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య తీవ్ర పోటీ జరుగుతుందని పరిశీలకులు చెబుతున్నారు. డాక్టర్ ఎమ్మెల్యేపై సానుభూతి పనిచేస్తుందని.. ప్రభుత్వం భావిస్తోంది. అయితే.. రాజధాని ఎఫెక్ట్ తమకు అనుకూలంగా ఉంటుందని.. టీడీపీ అంటోంది. ఇలా ఎలా చూసుకున్నా.. రెండు పార్టీల్లోనూ తర్జన భర్జన అయితే.. కొనసాగుతుండడం గమనార్హం.