లోకేష్‌కు అష్ట‌దిగ్బంధ‌నం.. వైసీపీ వ్యూహం

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి ప‌రిణామాలు తెర‌మీదికి వ‌స్తాయనేది ఎవ‌రూ చెప్ప‌లేని ప‌రిస్థితి. అలా వ‌చ్చి న ప‌రిణామాల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకుని.. ముందుకు సాగి.. విజ‌యాలు అందుకునే వారు మాత్రమే నాయకులుగా మిగులుతారు. ‌రే.. ఈ విష‌యం అలా ఉంచితే.. టీడీపీ యువ నాయ‌కుడు.. మాజీ మంత్రి నారా లోకేష్‌.. వైసీపీ టార్గెట్‌లో ముందున్నార‌నేది.. తాజాగా చ‌ర్చ‌కు వ‌స్తున్న విష‌యం . గ‌త ఎన్నిక‌ల్లో తొలిసారి నారా లోకేష్‌.. మంగ‌ళ‌గిరి నుంచి పోటీ చేశారు.

అయితే. అప్ప‌ట్లో లోకేష్‌ను వైసీపీ అస‌లు ప‌ట్టించుకోలేదు. టీడీపీకి ఉన్న అనేక నాయ‌కుల్లో లోకేష్‌ను ఒక నాయ‌కుడిగా.. కూడా చూడ‌లేదు.. ఏం పోటీ ఇస్తాడు..  అస‌లు లోకేష్ కూడా నాయ‌కుడేనా? అని కొడాలి నాని వంటివారు.. ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి వంటివారు.. 2019 ఎన్నిక‌ల‌కు ముందు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే.. అప్ప‌టి ఎన్నిక‌లు అయిపోయాయి. నారా లోకేష్ ఓడిపోయారు. నిజానికి ఈ ప‌రిణామాల త‌ర్వాత .. వైసీపీ అదే ప‌ద్ధ‌తిని కొన‌సాగించి ఉండాలి.

ఎందుకంటే.. లోకేష్‌లో ద‌మ్ములేద‌ని.. చెబుతున్నారు కాబ‌ట్టి.. 2019 ఎన్నిక‌ల‌కుముందు ఎంత లైట్ తీసు కున్నారో.. ఇప్పుడు కూడా అంతే లైట్ తీసుకోవాలి. కానీ, వైసీపీ అలా లైట్ తీసుకోవ‌డం లేదు. లోకేష్‌కు బ‌లంగా ఉన్నార‌ని భావిస్తున్న కీల‌క నాయ‌కుల‌ను త‌న‌వైపు తిప్పుకొనేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. టీడీపీ కంచుకోట‌గా భావించే సామాజిక వ‌ర్గంలో చీలిక‌లు తెస్తోంది. మ‌రిఇవ‌న్నీ ఎందుకు జ‌రుగుతున్నాయంటే.. 2019కి ముందు.. త‌ర్వాత‌.. నారా లోకేష్‌లో వ‌చ్చిన రాజ‌కీయ పెనుమార్పులే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని అంటు న్నారు ప‌రిశీల‌కులు.

రాజ‌కీయంగా ప‌దునైన వ్యాఖ్య‌లు సంధించ‌డం.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను టార్గెట్ చేయ‌డం.. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు ఐకాన్‌గా మారుతుండ‌డం వంటివి వైసీపీని క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తున్నాయి. అదేస‌మ‌యంలో చంద్ర‌బాబు త‌ర్వాత‌.. పార్టీ ప‌గ్గాలు అందుకునేందుకు .. 2024 ఎన్నిక‌ల‌ను లోకేష్ ఒక వార‌ధిగా భావిస్తున్నార‌నే చ‌ర్చ కూడా వైసీపీలో జ‌రుగుతోంది. ఆయ‌న క‌నుక గెలిస్తే.. టీడీపీని నిలువ‌రించ లేమ‌ని.. కాబ‌ట్టి.. ఆయ‌న‌ను ఓడించ‌డ‌మే ముందున్న ల‌క్ష్య‌మ‌ని.. వైసీపీ నాయకులు భావిస్తున్న‌ట్టు స‌మాచారం.

ఈ క్ర‌మంలోనే లోకేష్‌ను అన్ని వైపుల నుంచి అష్ట‌దిగ్భంధ‌నం చేసేలా.. రాజ‌కీయంగా.. ఆయ‌న‌కు అననుకూల ప‌రిస్థితులు క‌ల్పించేలా.. వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నార‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. మంగ‌ళగిరిలో బ‌ల‌మైన టీడీపీనాయ‌కులకు ప‌ద‌వులు, సొమ్ములు ఎర‌వేస్తున్నార‌నే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. ఇదంతా కూడా .. టీడీపీ యువ నాయ‌కుడినినైతికంగా దెబ్బ‌తీయడం ద్వారా.. పార్టీ లేకుండా చేయాల‌నే వ్యూహ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఈ ప‌రిణామాల‌ను లోకేష్ ఎలా నెగ్గుకు వ‌స్తారో చూడాలి.