ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నాయకుడు. జగన్ తొలి కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఫైర్ కాకపోయినా.. ఆ రేంజ్‌లో ఆయన జనసేనపైనా.. పవన్‌పైనా.. టీడీపీపైనా.. విరుచుకుపడ్డారు. వైసీపీ వాయిస్‌ను బలంగానే వినిపించారు. అయితే.. తర్వాత.. ఆయనను రెండో సారి విస్తరించిన కేబినెట్ నుంచి తప్పించారు. దీంతో అప్పటి నుంచి ఆయన కనిపించడం మానేశారు. ఆయనే మాజీ మంత్రి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు.
ప్రస్తుతం ఆయన ఏం చేస్తున్నారంటే..చెప్పడం కష్టమే. ఎందుకంటే.. పార్టీలో ఆయన యాక్టివ్‌గా ఉండ డం లేదు. మంత్రి పదవి పోయిందనే ఆవేదన ఆయనను వీడడం లేదు. పోనీ.. జగన్‌కు తాను వీరవిధేయుడనని చెప్పకొనే ఆయన.. గడపగడపకు కార్యక్రమం అయినా.. నిర్వహిస్తున్నారా? అంటే.. అది కూడా లేదు. ఎక్కడా నియోజకవర్గంలోనూ.. ఆయన కనిపించడం లేదు. ఇదిలావుంటే.. ఈ నియోజకవర్గంలో అటు జనసేన, ఇటు టీడీపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి.
వచ్చే ఎన్నికల్లో.. ఇక్కడ నుంచి బలమైన నాయకుడిని దింపేలా టీడీపీ ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే.. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అనుచరుడు.. ఏసుబాబుకు ఛాన్స్ ఇచ్చేదిశగా.. పార్టీ అడుగు లు వేస్తోందని వార్తలు వస్తున్నాయి. కాపు సామాజిక వర్గాన్ని సంఘటితం చేసి.. తాము లబ్ధి పొందే దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. ఇంకోవైపు.. వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్.. ఇక్కడ నుంచి పోటీ చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారట.
గత ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేసినా..పవన్ ఓడిపోయారు. అయితే.. ఇప్పుడు.. చాలా జాగ్రత్తగానే.. ఆయన అడుగులు వేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లోనూ రెండు నియోజకవర్గాల్లో పోటీ ఉంటుందని తెలుస్తోంది. వీటిలో ఒకటి తిరుపతి కాగా.. రెండోది కాకినాడ రూరల్ అనే చర్చ పార్టీలో జరుగుతోంది. ఇక్కడైతే.. మెగా అభిమానులు ఎక్కువ. పైగా.. కాపు సామాజిక వర్గం కూడా ఆయనకు అండగా నిలబడే ఛాన్స్ ఉంది. సో.. ఈ పరిణామాలు.. ఇంతగా మారుతున్నా.. కన్నబాబు మాత్రం సైలెంట్‌గా ఉంటున్నారని.. వైసీపీలో చర్చసాగుతోంది. మరి ఆయన ఇప్పటికైనా కదులుతారా? లేదా? అనేది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates