కిలారి ఆనంద్ పాల్ అలియాస్ కేఏ పాల్…ఇరు తెలుగు రాష్ట్రాలలో ఈయన గురించి పరిచయం అక్కర లేదు. క్రైస్తవ మత ప్రబోధకుడిగా దాదాపు 200 దేశాల్లో ‘మత ప్రచారం’ చేస్తున్నానని చెబుతుంటారు పాల్. ఇక, ఏపీ, తెలంగాణలో ప్రజా శాంతి పేరుతో ఓ రాజకీయ పార్టీని స్థాపించిన పాల్…తానే కాబోయే సీఎం నంటూ ప్రతి ఎన్నికల ముందు హడావిడి చేస్తూ కావాలసినంత కామెడీని కూడా పండిస్తుంటారు.
ఈ క్రమంలోనే తాజాగా పాల్ కామెడీగా కాకుండా…సీరియస్ గా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఏసు క్రీస్తు క్రిస్టియన్ కాదు.. హిందువూ కాదు.. మహమ్మదీయుడు కూడా కాదు.. ఆయన దైవ కుమారుడు..’ అంటూ కేఏ పాల్ చేసిన కామెంట్లు ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్నాయి. అంతేకాదు, తాను హిందువుగా జన్మించాననీ, హిందువుగానే మరణిస్తానని కూడా పాల్ సంచలన ప్రకటన చేశారు.
మతపరమైన కామెంట్లతో పాటు పొలిటికల్ గా కూడా పాల్ తన మార్క్ కామెంట్లతో మరోసారి కామెడీ చేశారు. చంద్రబాబు, కేసీఆర్, జగన్, గాంధీ కుటుంబ పార్టీలను జనం చిత్తుచిత్తుగా ఓడిస్తారని, ఇప్పుడైనా జనం తెలివితేటలుపయోగించి తన ప్రజాశాంతి పార్టీకి ఓటేయాలని రిక్వెస్ట్ కమ్ డిమాండ్ చేశారు పాల్. ఇక, ఒక్క ఓటు బీజేపీకి, మోదీకి, వైసీపీకి, టీడీపీకి వేయవద్దని పిలుపునిచ్చారు పాల్..
చిటికేసి లక్ష కోట్లు సంపాదిస్తా…ఐదు లక్షల కోట్లు దానం చేశానంటూ పాల్ విసిరిన పంచ్ డైలాగులకు ప్రెస్ క్లబ్ లోని జర్నలిస్టులు నవ్వాపుకోలేకపోయారు. తనకు, తన భార్యకు లక్ష రూపాయల ఆస్తి లేదని చెప్పుకొచ్చారు పాల్. అంతేకాదు, రూ.7 లక్షల కోట్ల అప్పులతో కోమాలో ఉన్న ఏపీని ఆదుకునే అవకాశమివ్వాలని కోరారు పాల్. మనో నేత్రాలు తెరచి మీకొరకు నాకు ఓట్లు వేయండి… ఏపీలో మంచి మహిళను సీఎం ను చేస్తా…తెలంగాణలో నేనే సీఎం అంటూ పాల్ చెప్పిన డైలాగ్ ప్రెస్ మీట్ మొత్తానికే హైలైట్. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా రావు..ఆ సంగతి వారికీ తెలుసు అంటూ జగన్ పై పాల్ చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి.
This post was last modified on August 2, 2022 9:51 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…